ETV Bharat / state

టెండర్లు రద్దుకు సీఎం కేసీఆర్ కృషి చేయాలి: సంపత్ - పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సర్కార్ పిలిచిన టెండర్లను రద్దు చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేయాలని ఏఐసీసీ సంపత్ కుమార్ డిమాండ్ చేశారు.

టెండర్లు రద్దుకు సీఎం కేసీఆర్ కృషి చేయాలి: సంపత్

author img

By

Published : Aug 2, 2020, 8:56 PM IST

పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏపీ ప్రభుత్వం పిలిచిన టెండర్లు ఆపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ను ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ టెండర్ల ప్రక్రియను వాయిదా వేయిస్తేనే దక్షిణ తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై సీఎంకు శ్రద్ధ ఉందన్న విషయం స్పష్టం అవుతుందన్నారు.

అపెక్స్‌ కమిటీ ఎదుట హాజరై టెండర్లను వాయిదా వేసేందుకు కృషి చేయాలన్నారు. తెరాస వల్లే కాంగ్రెస్‌, భాజపాల పేర్లు ముందు టీ వచ్చిందని మంత్రి కేటీఆర్‌ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్‌ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : మెడనొప్పిని నయం చేసే సరళ మత్స్యాసనం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.