కరోనా నేపథ్యంలో తెలంగాణ అవతరణ వేడుకలను.. ఈ ఏడాది నిరాడంబరంగా జరపాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జూన్ 2న తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించడం, అనంతరం జాతీయ పతాకావిష్కరణ మాత్రమే నిర్వహించాలని తెలిపారు. ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించవద్దని.. సీఎం స్పష్టం చేశారు.
మంత్రులు, అధికారులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు.. వారి వారి కార్యాలయాల్లోనే జాతీయ పతాకావిష్కరణ చేస్తారని చెప్పారు. ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించి, ఆ తర్వాత ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మంత్రులు.. ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ముందుగా అమరవీరులకు నివాళి అర్పించి అనంతరం పతాకావిష్కరణ చేస్తారు. జిల్లా కేంద్రంలో ముఖ్యమైన అధికారులతో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని పరిమితంగా నిర్వహిస్తారు.
ఇవీ చూడండి: పత్తికి అదనంగా రూ.275 పెంచండి!