ETV Bharat / state

స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి రగిలేలా వజ్రోత్సవాలు: సీఎం కేసీఆర్ - CM KCR on Independence day

CM KCR on Independence day: దేశభక్తి, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో రగిలేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు సహా యావత్‌ తెలంగాణ సమాజం ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

CM KCR
CM KCR
author img

By

Published : Aug 3, 2022, 5:11 AM IST

CM KCR on Independence day: దేశభక్తి, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో రగిలేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు సహా యావత్‌ తెలంగాణ సమాజం ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని, అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌లు, జడ్పీలు, నగర, పురపాలికల్లో ప్రత్యేక సమావేశాలుంటాయని వెల్లడించారు. ఉత్తమ గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, పాఠశాల, రైతు, వైద్యుడు, ఇంజినీర్‌, పోలీస్‌ అధికారి, కళాకారుడు, గాయకుడు, కవి తదితరులను గుర్తించి సత్కరిస్తామని వివరించారు. రాష్ట్రంలో మొత్తం 1.20 కోట్ల గృహాలపై ఎగురవేసేందుకు జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఆగస్టు 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న వజ్రోత్సవ ద్విసప్తాహం కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వజ్రోత్సవాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ కేశవరావు సహా 24 మంది సభ్యులు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, సీఎస్‌, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రారంభోత్సవం: వజ్రోత్సవాల ప్రారంభోత్సవాన్ని హెచ్‌ఐసీసీలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆర్మీ/పోలీస్‌ బ్యాండ్‌తో రాష్ట్రీయ వందనం, జాతీయ గీతాలాపన, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన జరపాలని నిర్ణయించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. మొత్తం రెండువేల మంది పాల్గొంటారు. సీఎం ప్రత్యేక సందేశం ఇస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాల్లో కొన్ని..

* ఈ నెల 8 నుంచి 22 వరకు ప్రభుత్వ, ఇతర ప్రతిష్ఠాత్మక భవనాలు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, స్టార్‌ హోటళ్లు, దవాఖానాలు, షాపింగ్‌ మాల్‌లు, జనసమ్మర్ద ప్రాంతాల్లో 15 రోజుల పాటు విద్యుత్‌ దీపాలు, ప్రత్యేకాలంకరణలు

* అన్ని విద్యాసంస్థల్లో ప్రతిరోజూ ప్రార్థన సమయంలో దేశభక్తి గీతాలను మైకుల ద్వారా వినిపించాలి.

* ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు

* ఉపాధ్యాయులు, అధ్యాపకులకు దేశభక్తిపై కవితారచన పోటీలు

* త్రివర్ణ బెలూన్ల ప్రదర్శన

* ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల విద్యార్థులకు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ప్రతిరోజూ ‘గాంధీ’ సినిమా ప్రదర్శన

* రవీంద్రభారతిలో 15 రోజులపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు

రోజువారీ కార్యక్రమాలు: ఆగస్టు 8న వజ్రోత్సవ ద్విసప్తాహం ప్రారంభోత్సవం, 9 నుంచి ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ, 10న గ్రామగ్రామాన మొక్కలు నాటే కార్యక్రమాలు, ఫ్రీడం పార్కుల ఏర్పాటు, 11న యువతీ యువకులు, క్రీడాకారులు, ఇతర వర్గాల భాగస్వామ్యంతో ఫ్రీడం రన్‌, 12న రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ మీడియా సంస్థల ద్వారా ప్రత్యేక వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలు, 13న విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మహిళలు తదితరుల భాగస్వామ్యంతో ర్యాలీలు, 14న సాయంత్రం నియాజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక జానపద కార్యక్రమాలు; తాలుకా, జిల్లా కేంద్రాల్లో, ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక బాణసంచా కార్యక్రమాలు, 15న స్వాతంత్య్ర వేడుకలు, 16న రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో సామూహిక జాతీయ గీతాలాపన; సాయంత్రం స్వాతంత్య్ర సమరం ఇతివృత్తంగా కవి సమ్మేళనాలు, ముషాయిరాలు, 17న రక్తదాన శిబిరాలు, 18న గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ఫ్రీడం కప్‌ క్రీడాపోటీలు, 19న ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైళ్లలో పండ్లు, మిఠాయిల పంపిణీ, 20న ముగ్గుల పోటీలు, 21న అసెంబ్లీ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు, 22న ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవాల ముగింపు వేడుకలు.

వజ్రోత్సవాల నిర్వహణకు జిల్లాస్థాయి కమిటీలు

వజ్రోత్సవాల నిర్వహణకు జిల్లాస్థాయి కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా మంత్రి ఛైర్మన్‌గా, కలెక్టర్‌ కన్వీనర్‌గా, జడ్పీ ఛైర్‌పర్సన్‌, పోలీస్‌ కమిషనర్‌/ఎస్పీ, మేయర్‌, పురపాలక ఛైర్‌పర్సన్‌, అదనపు జిల్లా కలెక్టర్‌, జడ్పీ సీఈవో, డీపీవో, డీఆర్‌డీవో, డీఈవో, డీపీఆర్వో, రహదారులు-భవనాల శాఖ ఎస్‌ఈలు సభ్యులుగా ఉంటారు.

ఇవీ చదవండి: 'ఇలాంటి వాళ్లను తెలంగాణ జాతి క్షమించదు..' రాజగోపాల్​రెడ్డిపై రేవంత్​ ఫైర్

భూగర్భ జలాలు విషపూరితం.. కేంద్రం షాకింగ్ కామెంట్స్​..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.