ETV Bharat / state

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై రేపు సీఎం సమీక్ష

author img

By

Published : Dec 18, 2020, 11:42 AM IST

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై రేపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం జరపనున్నారు. సీఎస్‌, ఉన్నతాధికారులతో కేసీఆర్‌ చర్చించనున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సమీక్ష చేయనున్నారు. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

CM kcr review tomorrow on non-agricultural property registrations in telangana
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై రేపు సీఎం సమీక్ష

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ రేపు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి హైకోర్టు ఆదేశాల కాపీ ఇంకా ప్రభుత్వానికి అందలేదు. అందిన తర్వాత కూలంకషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకునేందుకు భేటీ ఏర్పాటు చేశారు.

హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లడమా...? లేదంటే తగు విధమైన విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా...? అనే అంశంపై... రెవెన్యూ, న్యాయ శాఖల నిపుణులతో చర్చించనున్నారు. ఈ సమీక్ష తర్వాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదీ చూడండి : విముక్తి కోసం 25.59 లక్షల మంది ఎదురుచూపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.