ETV Bharat / state

ప్రతీ పైసాకు గ్రామ సభ ఆమోదం ఉండాల్సిందే: కేసీఆర్​ - సీఎం కేసీఆర్

పంచాయతీల్లో పచ్చదనం, పరిశుభ్రతతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధికి రూపొందించనున్న కార్యాచరణ ప్రణాళిక విధివిధానాలపై సీఎం కేసీఆర్​ సమీక్షించారు. గురువారం సాయంత్రం ప్రగతిభవన్​లో అధికారులతో పలు అంశాలపై చర్చించారు. నేడు మరోమారు సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

అధికారులతో కేసీఆర్​
author img

By

Published : Aug 30, 2019, 4:16 AM IST

Updated : Aug 30, 2019, 7:14 AM IST

పంచాయతీరాజ్​పై సీఎం కేసీఆర్​ సమీక్ష

హైదరాబాద్​ ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​ పంచాయతీరాజ్​ శాఖపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీల్లో పచ్చదనం, పరిశుభ్రతతోపాటు గ్రామాల సమగ్ర అభివృద్ధికి రూపొందించనున్న కార్యాచరణ ప్రణాళిక విధివిధానాలపై అధికారులతో చర్చించారు. నేడు మరోసారి సమీక్ష చేసి తుది నిర్ణయం ప్రకటిస్తామని సీఎం పేర్కొన్నారు. కార్యాచరణ ప్రణాళికలో ఏ ఏ అంశాలు ఉండాలో వాటిపై ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు.

ముందే నిధుల విడుదల

కార్యాచరణ ప్రణాళికపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి ప్రతి నెలా రూ. 339 కోట్లను గ్రామపంచాయతీలకు కార్యాచరణ పథకం అమలు ప్రారంభం కావడానికి ముందే విడుదల చేస్తునట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి నెల వచ్చే ఈ నిధులు మొత్తం 8 నెలల పాటు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి ఆదేశించారు.

అక్టోబర్​ 5 లేదా 6

కార్యాచరణ ప్రణాళిక అక్టోబర్ 5 లేదా 6 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ లోపల కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. కార్యాచరణ పకడ్బందీగా అమలు చేయడానికి సర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా ప్రతీ గ్రామ పంచాయతీ తన వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించుకుని దానికి గ్రామ సభ ఆమోదం పొందాలన్నారు.

ఆమోదం ఉండాల్సిందే

గ్రామంలో ఖర్చు పెట్టే ప్రతీ పైసా గ్రామ సభ ఆమోదంతోనే జరగాలని సీఎం స్పష్టం చేశారు. ఇవాళ జరగనున్న సమీక్షా సమావేశానికి కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. వారితో పాటు వారి జిల్లాలకు చెందిన ఇద్దరు ఎంపీడివోలను, ఒక డీఎఫ్​వోను, ఒక డీపీవోను, ఎస్​ఈ విద్యుత్ శాఖ, సీపీవోను తమ వెంట తీసుకురావాలని సీఎం పాలనాధికారులను ఆదేశించారు.

ఇవీ చూడండి.. మంచి మనసున్న మలయాళ మెగాస్టార్

TG_HYD_07_30_CM_REVIEW_FINANCE_FUNDS_3182388 reporter : sripathi.srinivas Note : ఫోటోలు డెస్క్ వాట్స్ అప్ కు వచ్చాయి. ( ) గ్రామాల పచ్చదనం, పరిశుభ్రత మెరుగు పరచడానికి, గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడానికి ఉద్దేశించబడిన కార్యాచరణ ప్రణాళిక విధివిధానాలపై గురువారం సాయంత్రం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. ఇవాళ మరోసారి సమీక్ష జరిపి తుది నిర్ణయం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కార్యాచరణ ప్రణాళికలో ఏ ఏ అంశాలు ఉండాలో వాటిపై ఇవాళ నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్యాచరణ ప్రణాళిక విషయంలో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి ప్రతి నెల రూ. 339 కోట్లు గ్రామపంచాయతిలకు కార్యాచరణ పథకం అమలు ప్రారంభం కావడానికి ముందే విడుదల చేస్తునట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతీ నెల విడుదలయ్యే ఈ నిధులు మొత్తం 8 నెలల పాటు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి ఆదేశించారు. కార్యాచరణ ప్రణాళిక అక్టోబర్ 5 లేదా 6వ తేదీ నుండి ప్రారంబమయ్యే అవకాశాలున్నాయని సీఎం అన్నారు. ఈ లోపల కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని కూడా సీఎం నిర్ణయించారు. కార్యాచరణ అమలు పటిష్టంగా, పకడ్బందీగా చేయడానికి సర్పంచులను, వార్డు సభ్యులను, అధికారులను, ఇతరులను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. కార్యచరణ ప్రణాళిక అమలులో భాగంగా ప్రతీ గ్రామ పంచాయతీ తన వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించుకొని దానికి గ్రామ సభ ఆమోదం పొందాలన్నారు. గ్రామంలో ఖర్చు పెట్టే ప్రతీ పైసా గ్రామ సభ ఆమోదంతోనే జరగాలని సీఎం స్పష్టం చేశారు. ఇవాళ జరగనున్న సమీక్షా సమావేశానికి ఇతర అధికారులు, అనధికారులతో పాటు కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాల కలెక్టర్లను కూడా పిలవాలని సీఎం అన్నారు. వారితో పాటు వారి జిల్లాలకు చెందిన ఇద్దరు ఎంపీడివోలను, ఒక డిఎఫ్ వోను, ఒక డిపివోను, ఎస్ ఇ విద్యుత్ శాఖ, సిపివోను తమ వెంట తీసుకురావాలని సిఎం ఆదేశించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శేరి శుభాష్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, పంచాయతి రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, ఓఎస్ డి ప్రియాంక వర్గీస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Last Updated : Aug 30, 2019, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.