CM KCR Review on Palamuru Rangareddy Project : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష (CM KCR Review on Palamuru Rangareddy Project) నిర్వహించారు. సచివాలయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లతో సీఎం భేటీ అయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై కేసీఆర్ విస్తృతంగా చర్చలు జరిపారు.
Palamuru Rangareddy Lift Irrigation Wet Run on 16th : ఈ క్రమంలోనే ఈనెల 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్‌ను ( Palamuru Rangareddy Lift Irrigation Wet Run) కేసీఆర్ ప్రారంభించనున్నారు. నార్లాపూర్ ఇన్‌టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు పాలమూరు రంగారెడ్డి సిద్ధమైంది. ఇందులో భాగంగానే 2 కిలోమీటర్ల దూరంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటి ఎత్తిపోయనుంది. ఈ నేపథ్యంలోనే కృష్ణానదికి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
Palamuru-Rangareddy Lift Irrigation Project Status : పరుగులు పెడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు
KCR Public Meeting in Nagarkarnool : ప్రపంచంలోనే మరెక్కడా లేని అత్యంత భారీ పంపులతో నిర్మితమైన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు.. దక్షిణ తెలంగాణ ప్రజల తాగు, సాగునీరు అవసరాలను తీర్చనున్నాయని కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఈ ఎత్తిపోతల పథకానికి స్వరాష్ట్రంలో.. ప్రభుత్వ దార్శనికతతో అనేక అడ్డంకులను దాటుకుని మోక్షం లభించడం చారిత్రక సందర్భమని కేసీఆర్ అన్నారు.
KCR on Palamuru Rangareddy Project : దశాబ్ధాల కల సాకారమౌతున్న చారిత్రక సందర్భంలో.. దక్షిణ తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు ఇది గొప్ప పండుగ రోజు అని కేసీఆర్ తెలిపారు. వెట్ రన్ ప్రారంభం రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనికి ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల సర్పంచ్‌లు, ప్రజలు హాజరుకావాలని పేర్కొన్నారు. మరోవైపు ఎత్తిపోతల జలాలతో గ్రామాల్లోని దేవుళ్లకు.. సర్పంచ్‌లు అభిషేకాలు చేయాలని కేసీఆర్ వివరించారు.
CM KCR: 'పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పరుగులు పెట్టాలి'
ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలోని కాల్వల తవ్వకం.. అందుకు సంబంధించి భూసేకరణ సహా అనుబంధ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కేసీఆర్ తెలిపారు. గతంలో కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులను మొదలు పెట్టినట్టే పెట్టి.. వాటిని ఆదిలోనే ఆపేసి పెండింగులో పెట్టేవారని.. ఇదీ ఉమ్మడి రాష్ట్ర పాలకుల వైఖరి అని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని కేసీఆర్ చెప్పారు.
ఉమ్మడి పాలనలో పెండింగ్‌లో పెట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడంతో పాలమూరు జిల్లా పచ్చబడడం ప్రారంభమైందని వివరించారు. వలసలు ఆగిపోయి బయటి రాష్ట్రాల నుంచే పాలమూరుకు.. ఉల్టా వలసలు ప్రారంభమయ్యాయని వివరించారు. మొక్కవోని పట్టుదల, ధృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టి కొనసాగించిన కృషి ఫలించిందని కేసీఆర్ వెల్లడించారు.
ఇందుకు అన్నిరకాలుగా కృషి చేసిన అధికారులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఇప్పటికే నిర్మితమైన జలాశయాల నుంచి నీటిని తరలించే కాల్వల నిర్మాణం కోసం టెండర్లు పిలవాలని వివరించారు. అచ్చంపేట ఉమామహేశ్వరం ఎత్తిపోతల పనులు ప్రారంభించాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో చేపట్టాల్సిన కాల్వల నిర్మాణం పనులను అధికారులతో కలిసి మంత్రులు పర్యవేక్షించాలని కేసీఆర్ సూచించారు.
పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను యుద్ధప్రాతిపదికన సంపూర్ణంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృఢ చిత్తంతో ఉందని కేసీఆర్ తెలిపారు. ఉత్తర తెలంగాణలో నిర్మించిన చెక్‌డ్యాంలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. దేశం మొత్తం మీద తెలంగాణలో మాత్రమే భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయని కేసీఆర్ వెల్లడించారు.