వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. సూపర్‌స్ప్రెడర్స్‌కు టీకా పంపిణీ పూర్తయిందా అని అడిగి తెలుసుకున్నారు.
ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ఎంత ఖర్చైనా భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సీఎం స్పష్టం చేశారు. పేదలకు కార్పొరేట్‌స్థాయి వైద్యం అందాలనేదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని కైటెక్స్ గ్రూపు యోచన