తెలంగాణ దళిత బంధు పథకం (Telangana Dalitha bandhu)పై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో అమలు చేయ తలపెట్టిన దళిత సాధికారత పథకానికి ‘తెలంగాణ దళిత బంధు’ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. రైతుబంధు తరహాలోనే ఈ పథకాన్ని కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ముందు నిర్ణయించిన ప్రకారమే రూ.1,200 కోట్లతో తెలంగాణ దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందని సీఎం ప్రకటించారు.
అయితే పైలట్ ప్రాజెక్టు అయినందున హుజూరాబాద్‌కు అదనంగా రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకూ వెచ్చించనున్నట్లు ఇదివరకే పేర్కొన్నారు. ఇక్కడ 20,929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. నిబంధనల మేరకు అర్హులైన వారిని ఎంపిక చేసి.. ఆయా కుటుంబాలకు పరిపూర్ణ స్థాయిలో పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. త్వరలోనే తేదీని ప్రకటిస్తామన్నారు.
ఇదీ చూడండి: త్వరలో కేసీఆర్ మరో కొత్త పథకం.. భారీగా నిధుల కేటాయింపు!