ETV Bharat / state

'తెల్ల బంగారం.. ప్రగతికి సాకారం' - తెలంగాణలో వ్యవసాయం

వచ్చే వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో పత్తిసాగుకు పెద్దపీట వేయాలని... దాన్ని 70లక్షల ఎకరాల్లో సాగుచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఏయే పంటలు సాగుచేయాలనే అంశంపై ప్రభుత్వ సూచనలు అనుసరిస్తూ రైతులంతా సహకరించాలని ఆయన కోరారు.

cm-kcr-review-meeting-about-agriculture
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/19-May-2020/7254861_kcr.jpg
author img

By

Published : May 19, 2020, 7:09 AM IST

Updated : May 19, 2020, 7:18 AM IST

జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులు(డీఏవో), వ్యవసాయ సహాయ సంచాలకులు(ఏడీ), మండల వ్యవసాయాధికారులు(ఏవో), రైతుబంధు సమితుల సభ్యులతో ప్రగతిభవన్‌ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సమావేశంలో వ్యవసాయంలో తీసుకోవాల్సిన మార్పులపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ వానాకాలంలో సాగు జాగ్రత్తలు, రైతులకు చెప్పాల్సిన అంశాలను ఆయన స్పష్టంగా వివరించారు. సాగు తీరుతెన్నులు, అనేకానేక సానుకూలతల నేపథ్యంలో తెలంగాణను అద్భుత వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

పుష్కలంగా ఉంది...

మొక్కజొన్న పంట గతేడాది పుష్కలంగా పండింది. ఇప్పటికే నిల్వలు దండిగా ఉన్నాయి. వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో ఈ పంటను సాగు చేయవద్దు. దాన్ని పండించినా మద్దతు ధరకు కొనేది లేదు. దీనిపై రైతులను చైతన్యపరచాలని అధికారులకు సూచించారు.

"ఏ పంటకు మార్కెట్‌లో ఎంత డిమాండుందో ప్రభుత్వం చెపుతుంది. దాన్ని అనుసరించి ఏది సాగుచేస్తే ఆదాయం పెరుగుతుందో దాన్నే రైతులు పండించాలి. ఈ సీజన్‌లో రాష్ట్రంలో కోటీ 35లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలనేది లక్ష్యం. ఇందులో 70లక్షల ఎకరాల్లో పత్తి, 40 లక్షల ఎకరాల్లో వరి, 12 నుంచి 15 లక్షల ఎకరాల్లో కంది వేయాలి. కంది పంట ఎంత పండినా ప్రతీ గింజను మద్దతు ధరకు కొంటాం. మిగతావి మిగిలిన 10లక్షల ఎకరాల్లో వేయాలి. సాగునీటి వసతి ఉన్న భూముల్లో పత్తి వేస్తే ఎకరానికి 12-15 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. రైతుకు రూ.50వేల దాకా ఆదాయం వస్తుంది. వరి సన్నరకాలను 25 లక్షల, లావు రకాల్ని 15లక్షల ఎకరాల్లో వేసేలా రైతులను చైతన్యపరచాలి. వేయదగిన విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, ప్రైవేటు డీలర్ల ద్వారా అమ్మే ఏర్పాట్లుచేస్తాం." -కేసీఆర్

కలెక్టర్లు పోటీపడాలి

ఏ పంట ఎంత విస్తీర్ణంలో ఏ జిల్లాలో వేయాలనే నియంత్రిత విధానాన్ని అమలుచేస్తాం. ఎక్కడ అది పక్కాగా అమలైతే అక్కడి రైతులకు రైతుబంధు సొమ్ము ఎక్కువ లభిస్తుంది. దీన్ని ఎక్కువగా తీసుకునేందుకు కలెక్టర్లు పోటీపడాలి. రెండు రోజుల్లో కలెక్టర్లు, డీఏవోలతో హైదరాబాద్‌లో సమీక్ష జరిపి వరిసాగుపై మరింత స్పష్టతనిస్తాం. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో డిమాండున్న పంటలపై ముందస్తు అంచనాలు వేసి చెప్పడానికి వ్యవసాయశాఖలో పరిశోధన, విశ్లేషణ.. మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాలు ఏర్పాటుచేస్తాం.

పచ్చిరొట్ట సాగుచేయాలి

యూరియా వంటి రసాయన ఎరువుల వినియోగం తగ్గించడానికి పంటల సాగుకు ముందు జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లు వేయించి పొలంలో కలియదున్నాలి. దీనివల్ల భూమికి నత్రజని పోషకం అందుతుంది. మన భూముల్లో ఇప్పటికే భాస్వరం నిల్వలున్నాయి. అది కరిగి భూమికి అందేలా చూసే సాల్యూబుల్‌ సొల్యూషన్లు(కరిగించే బ్యాక్టీరియా) వాడాలి. ప్రతీ 5 వేల ఎకరాలకొక వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో)ని నియమించాం. ఈ పోస్టులు ఎక్కడైనా ఖాళీగా ఉంటే వెంటనే పొరుగుసేవల విధానంలో భర్తీచేయాలి. ప్రతీ ఏఈవో పరిధిలో రైతువేదికను పక్కాగా 6 నెలల్లోగా నిర్మించాలి. రైతుల వద్ద వ్యవసాయ సామగ్రి, యంత్రాలెన్ని ఉన్నాయనే లెక్కలు పక్కాగా సేకరించాలి. ప్రతి వ్యవసాయాధికారి వద్ద ఈ వివరాలుండాలి. వీటి ఆధారంగా వ్యవసాయ యంత్రాలు ఇంకా ఎన్ని కావాలో నిర్ణయించడం సులభమవుతుంది.

ఆహారశుద్ధి సెజ్‌ ఏర్పాటు

రాష్ట్రంలో ఆహారశుద్ధి సెజ్‌ ఏర్పాటుచేస్తాం. అన్ని నియోజకవర్గాల్లో ఆహారశుద్ధి ప్లాంట్లు ఏర్పాటవుతాయి. పంటల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు వీటిలో తయారవుతాయి. బియ్యపు గింజ కనీసం 6.5మి.మీ. సైజులో ఉండాలి. అప్పుడే వాటికి ఎక్కువ డిమాండు ఉంటుంది. ఈసారి కరోనా వల్ల వరి ధాన్యం అధికంగా కొన్నాం. కానీ పంటలు కొనడం ప్రభుత్వ విధానం కాదు. ఇప్పుడు రైతులంతా సంఘటితమైతే దేనినైనా సాధించగలం.

అమెరికా జర్నల్‌లో తెలంగాణ సోనా

తెలంగాణ సోనా రకం వరి 10లక్షల ఎకరాల్లో వేయమని చెబుతున్నాం. దీని ఘనతపై అమెరికా జర్నల్‌లోనూ ప్రచురించారు. గతేడాది 1.23కోట్ల ఎకరాల్లో పంటలు పండాయి. ఈసారి ఇంకో 10లక్షల ఎకరాల్లో సాగు పెరుగుతుందని అంచనా. ఈ వానాకాలం సీజన్‌లో 2లక్షల ఎకరాల్లో కూరగాయలు, 1.88 లక్షల ఎకరాల్లో పసుపు వేయవచ్చు. ఎండుమిరప రెండున్నర లక్షల ఎకరాల్లో, సోయాచిక్కుడు 3.50 లక్షల ఎకరాల్లో సాగుచేయవచ్చు. వీరందరికీ రైతుబంధు ఇస్తాం. నాణ్యమైన పత్తి తెలంగాణ, విదర్భలో పండుతోంది. ఇంకా దీనిపై పరిశోధన చేయాలని స్వామినాథన్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి చెప్పారు. కొత్తగా 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యమున్న గోదాములు కట్టబోతున్నాం. సారవంతమైన భూములున్నందునే ఇక్రిశాట్‌ కూడా ఇక్కడే ఏర్పాటైంది. సగటున 900మి.మీ. వర్షం పడుతుంది. అందుకే అనేక రాష్ట్రాల రికార్డులు బద్దలు కొడుతూ అద్భుతమైన పంటలు పండాయి. దేశానికి, ప్రపంచానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది.

ఇవీ చూడండి: తెలంగాణ లాక్​డౌన్​లో వీటికి మినహాయింపులు

Last Updated : May 19, 2020, 7:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.