కరోనా వైరస్‌కు భారత్‌లో ఉన్న ఏకైక ఆయుధం లాక్‌డౌన్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ కరోనా వ్యాప్తి నివారణలో తెలివిగా వ్యవహరించిందని అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు వచ్చాయని సీఎం తెలిపారు. ఇప్పటివరకు అందరూ సహకరిస్తున్నారు, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పేర్కొన్నారు. గండం గట్టెక్కిందని ఇప్పుడే సంబరపడవద్దని, ఏ క్షణంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదని హెచ్చరించారు.
సౌత్ కొరియాలో ఓ కరోనా పాజిటివ్ వ్యక్తి నుంచి 59 వేల మందికి సోకిన ఉదంతాన్ని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇప్పటి మాదిరిగానే అందరూ సహకరిస్తే తక్కువ నష్టంతో బయటపడతామని స్పష్టం చేశారు. కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఉన్నంతకాలం స్వీయనిర్బంధంలో ఉండాలని మరోసారి ఉద్ఘాటించారు.
ఇదీ చూడండి:- పీఎం కేర్స్‌కు విరాళాల వెల్లువ- రైల్వే రూ.151కోట్లు