ETV Bharat / state

KCR: పర్యావరణ పరిరక్షణను మించిన సంపదే లేదు - పర్యావరణ పరిరక్షణ

జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. భూగోళంపై తలెత్తే సమస్యలను పరిష్కరించుకొనే దిశగా ప్రకృతిని తీర్చిదిద్దుకోవాలన్నారు. ప్రస్తుతం భూగోళం పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కుంటుందన్నారు.

cm-kcr-on-world-environment-day
KCR: పర్యావరణ పరిరక్షణను మించిన సంపదే లేదు
author img

By

Published : Jun 4, 2021, 6:32 PM IST

రాష్ట్ర ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేక సందేశం ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణను మించిన సంపదే లేదని... కరోనా మరోసారి రుజువు చేసిందని కేసీఆర్ పేర్కొన్నారు. స్వచ్ఛమైన ప్రాణవాయువు దొరకక పరితపిస్తున్నామని వాపోయారు. ఇలాంటి దుర్భర పరిస్థితులను పర్యావరణ పరిరక్షణ ద్వారా మాత్రమే అధిగమించగలమని కేసీఆర్ అన్నారు.

ఆరోగ్య సంపదను మించిన సంపద లేదన్న భావనతో తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కార్యాచరణ చేపట్టిందని సీఎం చెప్పారు. నాసిరకం ప్లాస్టిక్ వాడకం మీద నియంత్రణ విధించిన ప్రభుత్వం... గ్రీన్ కవర్ పెంచే హరితహరం వంటి పథకాలను పటిష్ఠంగా అమలు చేస్తోందన్నారు. గ్రామీణ, పట్టణాభివృద్దికోసం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు పర్యావరణాన్ని పెంచేందుకు దోహదం చేస్తున్నామని, జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంటున్నామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు, సాగునీరు రాష్ట్రవ్యాప్తంగా పుష్కలంగా లభిస్తోందని... పలు పథకాల ద్వారా పాడి పంటలు, పండ్లు, కూరగాయలు, మాంసాహారం సమృద్ధిగా ఉత్పత్తి అవుతోందని సీఎం తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి, నదీజలాలను మళ్లించడం ద్వారా అడుగడుగునా పచ్చదనం, ప్రకృతి పర్యావరణ సమతుల్యతను సాధించామన్నారు. తెలంగాణ ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్న కేసీఆర్... జీవవైవిధ్యంతో కూడిన ఆకుపచ్చని తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: కరోనా అంతం కోసం 'దెయ్యాల నృత్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.