అమరవీరుల దినోత్సవం- షహీద్ దివస్ పురస్కరించుకొని స్వాతంత్య్ర సమరయోధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను స్మరించుకున్నారు. స్వాతంత్య్ర పోరాటం అనేక రూపాల్లో సాగిందన్నారు.
అమరుల త్యాగాలతో స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా... ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ను సగర్వంగా నిర్వహించుకుంటున్నామని వెల్లడించారు. అమరుల త్యాగాలను స్మరించుకునే కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని కేసీఆర్ తెలిపారు.