Secunderabad Ujjaini Mahankali Bonalu 2023 : తెలంగాణలో ఆషాఢ మాసమంతా బోనాల జాతర ఉంటుంది. తొలిఏకాదశి ముగిలిన తర్వాత బోనాల జాతర మొదలవుతుంది. ఈ నెలంతా హైదరాబాద్ నగరమంతా బోనాలు చేసుకుంటారు. వర్షాకాలంలో చేసుకునే ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ కాలంలో జ్వరాలు, అంటు వ్యాధులు వ్యాపిస్తాయి. అలా జరగకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటూ అమ్మవారికి బోనం సమర్పిస్తే అంతా మంచి జరుగుతుందని రాష్ట్ర ప్రజల నమ్మకం. పండగ రోజున అమ్మవారికి నిష్టగా బోనం అలంకరించి అందులో నైవేద్యం వండి డప్పుచప్పుల్లతో అమ్మవారికి బోనం సమర్పిస్తారు.
CM KCR MLC Kavitha Participated in Lashkar Bonalu : బోనాలు అంటేనే గుర్తుకు వచ్చేది గోల్కొండ, లష్కర్. తెలంగాణ ముఖ్య పండుగైనా బోనాలు రాష్ట్రంలో ఘనంగా వారం వారం జరుగుతున్నాయి. గతవారం గోల్కొండ బోనాలు జరగ్గా ఈ వారం లష్కర్ బోనాలు జరుగుతున్నాయి. అమ్మాయిలు బోనాలతో వచ్చి దర్శించుకుని సందడి చేశారు. అమ్మవారికి ఉదయం ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి ఊరేగింపులో పోతురాజులు నృత్యాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. సోమవారం రంగం జరుగుతుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పించారు. మహంకాళి అమ్మవారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పంచి ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు తలసాని, ఇంద్రకరణ రెడ్డి ఈ వేడుకలో పాల్గొన్నారు.
Talasani TALK about Lashkar Bonalu 2023 : లష్కర్ బోనాలకు మరో ప్రత్యేకత ఉంది. రెండు రోజుల పాటు ఘట ఉత్సవాలు ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, రంగం కార్యక్రమాలు సందడిగా జరగనున్నాయి. బోనాల మరుసటి రోజు ఇక్కడ రంగ ప్రవేశం జరుగుతుంది. రంగ ప్రవేశం జరిగినప్పుడు అమ్మవారు ఆవహించిన వ్యక్తి తెలంగాణ ప్రజల భవిష్యత్‌ని చెబుతుంది. వర్షాలు ఎలా కురుస్తాయి, పంటల సాగు ఎలా ఉండనుంది తదితర విషయాలు చెప్తారు. లష్కర్ బోనాలు ముగిసిన తర్వాత ఈ నెల 16, 17 రోజుల్లో హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల్లో జరిగే బోనాలకు ఏర్పాట్లు చేయనున్నామని మంత్రి తలసాని తెలిపారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారని తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కఠినంగా చర్యలు చేపట్టామని అధికారులు పేర్కొన్నారు. భాగ్యనగరం అంతా భక్తుల కోలాహాలంతో ప్రకశిస్తుందని అన్నారు.
ఇవీ చదవండి: