దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్... కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు అంశాలపై నివేదించిన సీఎం.. కేంద్రమంత్రి గడ్కరీకి 5 లేఖలు అందించారు.
విజయవాడ-హైదరాబాద్ హైవేను 6 లైన్లుగా విస్తరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి- హైదరాబాద్ రహదారిని 4 లైన్లుగా విస్తరించాలని కోరారు. శ్రీశైలం రహదారిని విస్తరించాల్సిన అవసరం ఎంతో ఉందని గడ్కరీతో సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 1,138 కి.మీ రోడ్లను అభివృద్ధి పరచాలని.. రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ కోరారు.
షెకావత్‌తో భేటీ..
రాత్రి 7 గంటలకు కేంద్ర జల్‌శక్తి మంత్రి షెకావత్‌ను సీఎం కేసీఆర్ కలవనున్నారు. జల్‌శక్తి శాఖ గెజిట్‌పై అభ్యంతరాలను కేంద్రమంత్రికి తెలపనున్నారు. రాష్ట్ర ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు కోరనున్న కేసీఆర్.. కాళేశ్వరానికి జాతీయ హోదా, ఇతర అంశాలపై చర్చించనున్నారు.
ప్రధానికి పది లేఖలు..
ఈ నెల 3న ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ సుమారు 50 నిమిషాల పాటు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై విడివిడిగా పది లేఖలు అందజేశారు. ఐపీఎస్ క్యాడర్‌పై కేంద్రం సమీక్షించాలని, రాష్ట్రంలో సమీకృత టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు, హైదరాబాద్-నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులు కేటాయింపు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన విస్తరణ, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
హామీలు నెరవేర్చాలి..
తెలంగాణకు ఐపీఎస్ క్యాడర్ పోస్టుల సంఖ్యను పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అమిత్‌షాను ఆయన అధికారిక నివాసం 6ఏ, కృష్ణమేనన్ మార్గ్‌లో ముఖ్యమంత్రి శనివారం సాయంత్రం కలిశారు. సుమారు 40 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. ముఖ్యమంత్రి వెంట రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంపుతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చిన హామీలు నెరవేర్చాలని అమిత్‌షాను సీఎం కేసీఆర్ కోరారు.
సంబంధిత కథనాలు..
modi - kcr meet: ప్రధాని మోదీకి పది లేఖలు అందజేసిన సీఎం కేసీఆర్
kcr meet amitshah: ఐపీఎస్ క్యాడర్ పోస్టులు పెంచండి.. అమిత్‌షాకు సీఎం వినతి