ETV Bharat / state

నేడు ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్​ భేటీ... - TSRTC STRIKE UPDATES

ఆర్టీసీని మరింత బలోపేతం చేసి నాణ్యమైన ప్రజా రవాణా సంస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఆత్మీయ సమావేశం జరపనున్నారు. రాష్ట్రంలోని 97 డిపోల నుంచి ఐదుగురు చొప్పున ఆర్టీసీ కార్మికులు సమావేశానికి హాజరవుతారు. సంస్థ ప్రస్తుత స్థితిగతులను వారికి వివరించడంతో పాటు సంస్థ కోసం తీసుకోవాల్సిన చర్యలపై కార్మికులతో ముఖ్యమంత్రి చర్చిస్తారు.

CM KCR MEETING WITH RTC EMPLOYEES ON RTC PROBLEMS

author img

By

Published : Dec 1, 2019, 6:25 AM IST

Updated : Dec 1, 2019, 7:18 AM IST

నేడు ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్​ భేటీ...

ఆర్టీసీ కార్మికుల సుదీర్ఘ సమ్మె, విరమణ, తదనంతర పరిణామాల దృష్ట్యా కార్మికులతో సీఎం కేసీఆర్ నేడు ఆత్మీయ సమావేశం జరపనున్నారు. కార్మికులతో స్వయంగా సమావేశమై సంస్థకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో చర్చిస్తానని మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఇవాళ ప్రగతి భవన్ వేదికగా ఆర్టీసీ కార్మికులతో సీఎం సమావేశం కానున్నారు

అన్ని డిపోల నుంచి కార్మికులు...

రాష్ట్రంలోని 97 ఆర్టీసీ డిపోల నుంచి ఐదుగురు చొప్పున కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొననున్నారు. మహిళలతో పాటు అన్ని వర్గాల వారు సమావేశంలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల కల్లా కార్మికులు ప్రగతి భవన్ చేరుకోవాల్సి ఉంటుంది. కార్మికులకు భోజనాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

సంఘాలతో సంబంధం లేకుండా...

భోజనాల అనంతరం సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో సమావేశమవుతారు. ఆర్టీసీ ప్రస్తుత స్థితిగతులు, ఆర్థిక పరిస్థితిని కార్మికులకు సీఎం కేసీఆర్ స్వయంగా వివరిస్తారు. ఇటీవల మంత్రివర్గ సమావేశం కోసం ఆర్టీసీపై రూపొందించిన నివేదికను తెలుగులో సిద్ధం చేశారు. ప్రత్యేకించి కార్మిక సంఘాల వైఖరి వల్ల సంస్థకు జరుగుతున్న నష్టం, కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి వారికి వివరించే అవకాశం ఉంది. కార్మిక సంఘాలతో సంబంధం లేకుండా ఆర్టీసీని అద్భుతమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశా నిర్దేశం చేస్తారు.

లాభాలు పంచుకునే స్థాయికి ఆర్టీసీ...

సంస్థలో ఇన్నేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకోవడం ద్వారా ఆర్టీసీని మరింత బలోపేతం చేసి, నాణ్యమైన ప్రజా రవాణా సంస్థగా తీర్చిదిద్దేందుకు చేపట్టనున్న కార్యక్రమాలపై సీఎం చర్చిస్తారు. సింగరేణి తరహాలో ఆర్టీసీలోనూ కార్మికులు లాభాలు పంచుకునే పరిస్థితి తీసుకువస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగా అనుసరించాల్సిన వ్యూహంపై కార్మికులతో సీఎం సమీక్షిస్తారు. సంస్థలో ఉన్న లోటుపాట్లు, తీసుకు రావాల్సిన మార్పులు, చేర్పుల గురించి కార్మికుల నుంచి ముఖ్యమంత్రి అభిప్రాయాలు స్వీకరించనున్నారు.

ఇవీ చూడండి: 'పోలీసులు మానవీయ కోణంలో స్పందించాలి'

File : TG_Hyd_71_30_CM_RTC_meeting_Dry_3053262 From : Raghu Vardhan ( ) కార్మికులతో రేపటి సమావేశం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మతో పాటు ఇతర అధికారులతో సీఎం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 97 ఆర్టీసీ డిపోల కార్మికులతో ముఖ్యమంత్రి రేపు సమావేశం కానున్నారు. ఒక్కో డిపో నుంచి ఐదుగురు కార్మికులు చొప్పున సమావేశానికి ఆహ్వానించారు. ఆర్టీసీకి సంబంధించిన అన్ని అంశాలపై కార్మికులతో ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. రేపటి సమావేశం నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్... సంస్థ స్థితిగతులు, కార్మికుల డిమాండ్లు సహా అన్ని అంశాలపై ఆరా తీశారు. కార్మికులతో సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలు, ప్రభుత్వ పరంగా చెప్పాల్సిన అంశాలపై సీఎం సమీక్షించారు.
Last Updated : Dec 1, 2019, 7:18 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.