రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సాయంత్రం బంజారాహిల్స్‌లోని సీజే నివాసానికి సీఎం కేసీఆర్ వెళ్లి భేటీ అయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం మర్యాద పూర్వకంగా భేటీ అయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. పలు పాలనాపరమైన, ఇతర అంశాలపై రెండు గంటలకుపైగా ఇరువురూ చర్చించినట్లు సమాచారం. సీఎం వెంట సీఎస్ సోమేశ్‌కుమార్ కూడా ఉన్నారు.
ఇవీ చూడండి..
త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 1,500 పల్లె దవాఖానాలు: మంత్రి హరీశ్‌రావు
ఆ ఆడబిడ్డల బాధ్యత మాది: గవర్నర్ ట్వీట్‌కు సుచిత్ర ఎల్ల రిప్లై