ఆర్టీసీలో ఆరోగ్యకర పోటీ ఉండటం కోసమే ప్రైవేటు ఆలోచన అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భాజపా తెచ్చిన కొత్త రవాణా చట్టం ప్రకారమే వెళ్తున్నామని వివరించారు. యూపీలో దాదాపు 25వేల ప్రైవేటు బస్సులు ఉన్నాయని గుర్తుచేశారు. యూనియన్లంటే సంస్థను, కార్మికులను కాపాడాలని హితవు పలికారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి ఐదేళ్లలో రూ.712 కోట్లు ఇస్తే... తెరాస ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.900 ఇచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: పవర్ స్టార్ అభిమానులు పండుగ చేసుకునే వార్త..