ETV Bharat / state

CM KCR: 'శ్రీకృష్ణుని కార్యాచరణ ప్రతి ఒక్కరికీ అనుసరణీయం' - telangana varthalu

కృష్ణ భగవానుని జన్మదినం హిందువులకు పర్వదినమని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన శ్రీకృష్ణజన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ హిందూ ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ జీవన విధానంలో శ్రీకృష్ణుని తాత్వికత అత్యంత ప్రత్యేకమైనదీ, ప్రభావశీలమైనదని సీఎం తెలిపారు.

CM KCR: 'శ్రీకృష్ణుని కార్యాచరణ ప్రతి ఒక్కరికీ అనుసరణీయం'

author img

By

Published : Aug 31, 2021, 2:40 AM IST

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శ్రీకృష్ణజన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణ భగవానుని జన్మదినం హిందువులకు పర్వదినమని ఆయన అన్నారు. గోకులాష్టమిగా, ఉట్ల పండుగగా ప్రజలు జరుపుకునే శ్రీకృష్ణుని జన్మదినానికి పురాణ, ఇతిహాసాల్లో ప్రత్యేకత ఉందన్నారు. భారతీయ హిందూ ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ జీవన విధానంలో శ్రీకృష్ణుని తాత్వికత అత్యంత ప్రత్యేకమైనదీ, ప్రభావశీలమైనదని సీఎం తెలిపారు.

నేటి సాంకేతిక యుగంలో అనేక రకాల ఒత్తిల్లకు గురవుతూ, సమయ సందర్భానుసారంగా సరైన నిర్ణయాలను తీసుకోలేకపోతున్న నేటి యువత శ్రీకృష్ణుని జీవన ప్రయాణాన్ని లోతుగా అవగాహన చేసుకోవాల్సి ఉందని సీఎం అన్నారు. మానవ సామాన్య మస్తిష్కం అర్థం చేసుకోలేని అనేక సందేహాలకు కృష్ణతత్వంలో సమాధానాలున్నాయన్నారు. నైరూప్యమానమైన శ్రీకృష్ణలీలల్లో పలు కోణాలల్లో పరమార్థం దాగివుంటుందని సిఎం వివరించారు. స్థితప్రజ్జతను సాధించడం ద్వారా మాత్రమే లక్ష్యాన్ని ఛేదించి గమ్యాన్ని ముద్దాడతామనే శ్రీకృష్ణుని కార్యాచరణ ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఇదీ చదవండి: good news: పదోన్నతుల అంశంపై ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.