ETV Bharat / state

CM KCR inspect Secretariat: సచివాలయాన్ని సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలి: సీఎం - telangana new secretarait

సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

author img

By

Published : Dec 9, 2021, 2:29 PM IST

Updated : Dec 9, 2021, 8:01 PM IST

14:27 December 09

సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

CM KCR inspect Secretariat: సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, అధికారులతో కలిసి సాయంత్రం సచివాలయ ప్రాంగణానికి వచ్చిన సీఎం... గంటన్నర పాటు పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లిన ముఖ్యమంత్రి... రెండస్తుల వరకు వెళ్లి పరిశీలించారు. పనుల పురోగతిని ఆరా తీశారు. పనులు జరుగుతున్న తీరు, పూర్తయ్యే సమయాలను అధికారులు, ఇంజినీర్లు సీఎంకు వివరించారు. భవనం పశ్చిమ భాగాన ఇప్పటికే ఐదంతస్తుల వరకు స్లాబు పనులు పూర్తి కాగా... ఆరో అంతస్తు స్లాబు పనులు కొనసాగుతున్నాయి. ముందు భాగంలో మూడో స్లాబు పనులు జరుగుతున్నాయి. రెండంతస్తుల వరకు గోడల పనులు కూడా పూర్తయ్యాయి.

అధికారులు, ఇంజినీర్లకు అభినందన

మార్చి నెలాఖరు వరకల్లా స్ట్రక్చర్ పనులు పూర్తి చేస్తామని అధికారులు, ఇంజినీర్లు వివరించారు. మొదటి రెండంతుస్తుల్లో మంత్రుల ఛాంబర్లలోని గదులు, సీలింగ్ తదితరాల గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్... ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అధికారులు, ఇంజినీర్లు, సిబ్బందిని అభినందించారు. భవన నిర్మాణంలో వినియోగించే రాళ్లు, టైల్స్, గ్రానైట్లు, మార్బుల్స్ సహా ఇతర సామాగ్రిని ముఖ్యమంత్రి పరిశీలించారు. వివిధ కంపెనీలకు చెందిన టైల్స్, మార్బుల్స్, గ్రానైట్స్​ను మొదటి అంతస్తులో ప్రదర్శించారు. వివిధ ప్రాంతాల్లో ఉపయోగించాల్సిన వాటిని సీఎం కేసీఆర్ ఎంపిక చేసినట్లు తెలిసింది.

మరికొన్ని డిజైన్లు తెప్పించాలని ఆదేశం

ఎర్రకోట నిర్మాణానికి వినియోగించిన ఆగ్రా ఎర్రరాతిని సచివాలయ భవన వెలుపలి గోడలకు వినియోగించనున్నారు. మధ్యలో ధోల్ పూర్ బీజ్ రాతిని ఉపయోగిస్తారు. పైభాగం కోసం మరో రంగు రాతిని తెప్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం. కిటికీలు, ఇతరత్రాలకు సంబంధించి మరికొన్ని నమూనాలు తెప్పించాలని సూచించినట్లు తెలిసింది.

సుందరంగా కనిపించాలి..

సచివాలయ నిర్మాణ పనులను పూర్తి చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ అధికారులను ఆదేశించారు. సచివాలయం ప్రకాశవంతంగా కనిపించాలన్నారు. సచివాలయాన్ని సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలని సూచించారు. నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న సచివాలయ నిర్మాణాలను పరిశీలించాలని... అందులో మంచి అంశాలను స్వీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ అధికారులకు సూచించారు.

ఇది చదవండి:

Telangana New Secretariat : స్పెషల్​ పోలీస్​కు కొత్త సచివాలయ భద్రత బాధ్యత!

Last Updated : Dec 9, 2021, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.