ETV Bharat / state

ఫిబ్రవరిలోనే యాదాద్రి ప్రధానాలయ ప్రారంభం: సీఎం కేసీఆర్​

author img

By

Published : Oct 28, 2019, 7:34 PM IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ముచ్చింతల్​​లో జరిగిన చినజీయర్​ స్వామి తిరునక్షత్ర మహోత్సవానికి సీఎం కేసీఆర్​ సతీసమేతంగా హాజరయ్యారు. చినజీయర్ స్వామిని దర్శించుకుని ఆశీసులు తీసుకున్నారు. సత్య సంకల్ప గ్రంథాన్ని కేసీఆర్​కు స్వామిజీ బహుకరించారు. యాదాద్రి ప్రధానాలయాన్ని వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు కేసీఆర్​ తెలిపారు.

CM KCR IN CHINJEYAR SWAMY THIRU NAKSHATRA MAHOTSAVAM IN MUCCHINTHAL

యాదాద్రి ప్రధాన ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తికానుందని... ఫిబ్రవరిలో ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రారంభోత్సవంలో చినజీయర్‌ స్వామి సమక్షంలో 1008 కుండాలతో మహా సుదర్శన యాగం నిర్వహిస్తామని వివరించారు. ప్రపంచ వైష్ణవ పీఠాల నుంచి స్వాములను పిలిపించాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చినజీయర్‌స్వామి ఆశ్రమంలో తిరునక్షత్ర వేడుకల్లో కుటుంబ సమేతంగా కేసీఆర్​ పాల్గొన్నారు. చిన జీయర్ స్వామిని దర్శించుకుని ఆశీసులు పొందారు.

చినజీయర్​ స్వామిని తిరునక్షత్ర సుముహూర్తాన దర్శించుకోవటం భాగ్యమని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. స్వామివారి సేవలు కొనియాడిన కేసీఆర్​... తన గురువులు, వివాహం, సంప్రదాయాల గురించి వివరించారు. సీఎం కేసీఆర్ సకుటుంబంగా వేడుకల్లో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు చినజీయర్​ స్వామి. సత్య సంకల్ప గ్రంథాన్ని కేసీఆర్​కు బహుకరించారు. అద్బుతమైన కార్యక్రమాలు చేస్తూ... రాజకీయ నాయకుల్లో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారని ప్రశంసించారు. దేశంలోనే యాదాద్రి క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని మరికొన్ని ఆలయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్వామిజీ అభిప్రాయపడ్డారు.

సీఎం కేసీఆర్​తో పాటు మంత్రులు హరీశ్​ రావు, ఎర్రబెల్లి దయాకర్​ రావు, స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి తదితరులు ఉన్నారు.

తిరునక్షత్ర మహోత్సవంలో సీఎం కేసీఆర్​ దంపతులు...

ఇదీ చదవండిః 'నిమ్స్​ నుంచే నిరాహార దీక్ష కొనసాగిస్తా'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.