ETV Bharat / state

ఎస్సీ ఉపకార వేతనాలకు కొత్త దరఖాస్తు - ఎలా అప్లై చేసుకోవాలంటే ? - SC Scholarship New Application - SC SCHOLARSHIP NEW APPLICATION

New Application for SC Scholarships : రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఎస్సీ విద్యార్థుల బోధన ఫీజులు, ఉపకార వేతనాలు వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మేరకు 2024-25 నుంచి కేంద్ర సహాయం అమలు కానుంది. దరఖాస్తు విధానంలోనూ కేంద్రం మార్గదర్శకాలతో మార్పులు జరిగాయి. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల పదో తరగతి మెమో, ఆధార్​లోని వివరాలు సరిపోవాల్సిందే. మరి దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలసుకుందాం రండి.

New Application for SC Scholarships for Students
New Application for SC Scholarships (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2024, 5:24 PM IST

New Application for SC Scholarships for Students in Telangana : తెలంగాణలో ఎస్సీ విద్యార్థుల బోధన ఫీజులు, ఉపకార వేతనాలు 2024-25 విద్యాసంవత్సరం నుంచి వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. కేంద్రం మార్గదర్శకాలతో ఎస్సీ ఉపకార వేతనాల దరఖాస్తు విధానంలోనూ ఎస్సీ సంక్షేమశాఖ మార్పులు చేసింది. ఎస్టీ, మైనార్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు మాత్రం పూర్వవిధానంలోనే దరఖాస్తు చేయాలి. 2021 నుంచి కేంద్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల బోధన ఫీజులు, ఉపకార వేతనాల నిబంధనలు మార్చింది.

మొదట రాష్ట్ర ప్రభుత్వం దీని కోసం 40% నిధులు జమ చేస్తే కేంద్రం 60% మంజూరు చేస్తుంది. రాష్ట్రంలోని ఈ నిబంధనలకు గత ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఏటా రూ.250 కోట్ల చొప్పున మూడేళ్లుగా దాదాపు రూ.750 కోట్లు కోల్పోయింది. 2024-25 నుంచి కేంద్ర సంస్కరణల అమలుకు ప్రస్తుత ​ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ప్రతి సంవత్సరం ఇంటర్, ఆపై ఉన్నతవిద్యను అభ్యసిస్తున్న 2.6 లక్షల మంది విద్యార్థులకు మేలు జరగనుంది.

ఈ-పాస్‌ వెబ్‌సైట్లో దరఖాస్తు ఇలా చేసుకోండి

  • రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల కోసం ఈ-పాస్‌ వెబ్‌సైట్లో దరఖాస్తును అందుబాటులోకి తీసుకొచ్చింది. 2024-25లో కొత్తగా చేరిన, అప్పటికే విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేయాలి.
  • మొదటి దశలో డెమోగ్రాఫిక్‌ మ్యాచింగ్, రెండోదశలో బయోమెట్రిక్‌ ఆథెంటిఫికేషన్‌ ఉంటుంది. మూడో దశలో దరఖాస్తు పూర్తి చేయాలి. డే స్కాలర్​, కాలేజీ అనుబంధ హాస్టళ్ల విద్యార్థులు సైతం ఇదే తరహాలో పూర్తి చేయాలి.
  • డెమోగ్రాఫిక్‌ ఆథెంటిఫికేషన్‌ కోసం విద్యార్థి ఆధార్‌లోని పేరు, పదో తరగతి ధ్రువీకరణ పత్రంలో పేరు సరిపోలాలి. టెన్త్​ క్లాస్​ హాల్‌టికెట్‌ నంబర్​, పుట్టినతేదీ, ఉత్తీర్ణత సాధించిన ఏడాది, రెగ్యులర్‌/ప్రైవేటు వివరాలు నమోదు చేయాలి.
  • విద్యార్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ కనిపిస్తాయి. స్టూడెంట్​ జెండర్, కులం, ఉపకులం, ఆధార్‌ నంబర్​, మొబైల్‌ నంబరు, చదువుతున్న యూనివర్సిటీ/బోర్డు, కళాశాల పేరు, ఊరు నమోదు చేసి సబ్మిట్​ చేయాలి.
  • అనంతరం డెమో ఆథెంటిఫికేషన్‌ జరుగుతుంది. పదో తరగతి మెమో, ఆధార్‌లోని వివరాలు సమానంగా ఉంటే విజయవంతమైనట్లు ఫోన్​కు మెసేజ్​ వస్తుంది. డెమోగ్రాఫిక్‌ ధ్రువీకరణ ఫెయిలైతే దాని ప్రకారం ఆధార్‌లో మార్పులు చేసి ధ్రువీకరించుకున్నాక దరఖాస్తు నంబరు వస్తుంది.
  • తర్వాత రెండో దశకు ఆ వివరాలతో మీ సేవ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్‌ ఆథెంటిఫికేషన్‌ ఇవ్వాలి. అప్పుడే రెండోదశ దరఖాస్తు పూర్తవుతుంది.
  • బయోమెట్రిక్‌ పూర్తయిన తరువాత విద్యార్థి వివరాలు నమోదు చేస్తేనే దరఖాస్తు పూర్తవుతుంది. దీన్ని పరిశీలన కోసం కళాశాలలో ఇవ్వాలి.

కోర్సు ముగిసే వరకు ఉపకారవేతనాలు - ఉన్నత విద్యకు అండగా 'పీఎం యశస్వి' - ఎవరు అర్హులంటే? - PM Yasasvi ScholarShip 2024

డిగ్రీ, పీజీ విద్యార్థులకు బంపర్​ ఆఫర్ - SBI ఉచిత స్కాలర్​షిప్స్ - ఇలా అప్లై చేసుకోండి! - SBI Foundation Scholarship 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.