ETV Bharat / state

Kcr Fire on Central Govt: గుజరాత్‌ మోడల్‌.. లోన లొటారం.. పైన పటారం: కేసీఆర్​

Kcr Fire on Central Govt: దేశాన్ని పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మెదడులేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ దిక్కుమాలినతనంగా, దరిద్రంగా ఉందన్నారు. కేంద్రం దేశాన్ని నాశనం చేస్తోందని విమర్శించారు.

Kcr
Kcr
author img

By

Published : Feb 1, 2022, 6:15 PM IST

Updated : Feb 2, 2022, 3:45 AM IST

Kcr Fire on Central Govt: కేంద్ర ప్రభుత్వానికి మెదడు లేదని సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర విద్యుత్‌ విధానం చెత్తగా ఉందని ముఖ్యమంత్రి విమర్శించారు. కేంద్రం దేశాన్ని నాశనం చేస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్‌, ఇప్పుడు భాజపా దేశాన్ని నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారంతో మోదీ అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. గుజరాత్‌ మోడల్‌.. లోన లొటారం.. పైన పటారమని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్‌ దిక్కుమాలినతనంగా దరిద్రంగా ఉందన్నారు.

పవిత్ర గంగా నదిలో శవాలు తేలేలా కేంద్రం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. విద్యుత్‌ సంస్కరణల పేరుతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆయన... కరోనా సమయంలో ఆరోగ్యరంగానికి బడ్జెట్‌ పెంచలేదని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించలేదన్న సీఎం... రూ.లక్షల కోట్లు ముంచిన వాళ్లకు రాయితీలు ఇస్తారన్నారు. భాజపా పాలన అంటే.. నమ్మి ఓట్లేసిన వాళ్లను ముంచుడేనన్నారు.

'ప్రపంచ ఆకలి బాధపై ఏటా హంగర్‌ ఇండెక్స్‌ వెలువడుతుంది. హంగర్‌ ఇండెక్స్‌లో భారత్‌ 101 స్థానంలో నిలిచింది. నేపాల్‌, బంగ్లాదేశ్‌ కంటే అద్వాన స్థితిలో భారత్‌ ఉంది. బడ్జెట్‌లో ఆహార రాయితీలు కూడా తగ్గించారు. బడ్జెట్‌లో పంటల మద్దతు ధరల ప్రస్తావన లేదు. కేంద్ర బడ్జెట్‌తో ఎవరిని ఉద్దరించారు. ఎల్‌ఐసీని అమ్ముతామని నిస్సిగ్గుగా చెబుతున్నారు. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారు. అమెరికా కంపెనీలకు బ్రోకర్లుగా వ్యవహరిస్తారా?'

-- కేసీఆర్, సీఎం

కేంద్ర ప్రభుత్వానికి మెదడు లేదు: కేసీఆర్

'రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీ..'

రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న కేసీఆర్​.. మరో 40 నుంచి 50 వేలు త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా చర్యలు చేపట్టామని వివరించారు. కొందరు స్వార్థపరులైన ఉద్యోగులకు వత్తాసు పలుకుతారా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. 317 జీవో విషయంలో అనవసర రాద్ధాంతం చేసే వారిని నిలదీయాలని కేసీఆర్ యువతకు పిలుపునిచ్చారు.

'తెలంగాణ నమూనా కావాలంటున్నారు...'

కొవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ ఆదాయవృద్ధిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తోందని... ఎక్కడా అమలు కాని పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని చెప్పారు. దళితబంధు లాంటి పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించిన కేసీఆర్... తెలంగాణ నమూనా కావాలని మహారాష్ట్ర, కర్నాటక వాసులతో పాటు దేశం డిమాండ్ చేస్తోందన్నారు.

చెమటోడ్చి సమతామూర్తి విగ్రహం ఏర్పాటు...

చినజీయర్‌స్వామి రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. రామానుజాచార్యుల విగ్రహానికి రామేశ్వరరావు వందెకరాలు ఇచ్చారని చెప్పారు. ముచ్చింతల్‌ కేంద్రంలో అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తారని వివరించారు. సమతామూర్తి విగ్రహానికి భాజపా, అనుబంధ సంస్థలు రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. యూపీ ఎన్నికల ప్రచారంలో విగ్రహం ఘనత భాజపాదేనని చెబుతున్నారని మండిపడ్డారు. జీయర్‌స్వామి చెమటోడ్చి సమతామూర్తి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని కొనియాడారు.

ప్రపంచాన్ని ఆకర్షించే ఆధ్యాత్మిక కేంద్రం అవుతుందన్నారు. తెలంగాణ సొమ్ములతో కేంద్రం సోకులు పడుతోందని విమర్శించారు. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఉద్ఘాటించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేది గుండు సున్నా అని అన్నారు. ఎనిమిదేళ్లలో కేంద్ర పథకాల ద్వారా రూ.42 వేల కోట్లు వచ్చాయన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు రైతుబంధు పథకం నిధులంత లేవని ఆరోపించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

Cm Kcr on Budget: బడ్జెట్‌ అంతా గోల్‌మాల్‌ గోవిందం: సీఎం కేసీఆర్

Last Updated : Feb 2, 2022, 3:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.