ETV Bharat / state

వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. రూ. 5వేల కోట్ల నష్టం అంచనా - వరదలపై సీఎం కేసీఆర్ రివ్యూ

వరదల ప్రభావంపై సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష

author img

By

Published : Oct 15, 2020, 6:20 PM IST

Updated : Oct 15, 2020, 8:04 PM IST

18:18 October 15

వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. రూ. 5వేల కోట్ల నష్టం అంచనా

        రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సంబంధిత మంత్రులు, అధికారులతో సమావేశమైన సీఎం... చేపట్టిన సహాయ, పునరావాస చర్యలను సమీక్షించారు. రాబోయే రోజుల్లో చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు.  

50 మంది మృతి...

        రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరదల వల్ల గురువారం నాటికి 50 మంది మరణించారని, జీహెచ్ఎంసీ పరిధిలో 11 మంది ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల 35వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని... అందులో సగం పంటలకు నష్టం కలిగినా రూ. 2 వేల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. 1916 తర్వాత జీహెచ్ఎంసీలో ఒకేరోజు 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు.  

35 వేల కుటుంబాలు ప్రభావితం...

         హైదరాబాద్​లో 72 ప్రాంతాల్లోని 144  కాలనీల్లో 20 వేలకు పైగా ఇళ్లు నీటిలో చిక్కుకున్నాయని... తద్వారా 35 వేల కుటుంబాలు ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. ఎల్బీనగర్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలో వరదల ప్రభావం ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. నగరంలో 14 ఇళ్లు పూర్తిగా, 65 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని.. 445 చోట్ల బీటీ, ఆరు చోట్ల జాతీయ రహదార్లు దెబ్బతిన్నాయన్నారు.  

కొనసాగుతోన్న సహాయ చర్యలు...

          జీహెచ్ఎంసీ, డిజాస్టర్, ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో సహాయకచర్యలు జరుగుతున్నాయని, రహదార్ల పునరుద్ధరణ జరుగుతోందన్నారు. హైదరాబాద్​లో 72 చోట్ల పునరావాస కేంద్రాలు ప్రారంభించి తాత్కాలిక ఆవాసం, భోజనం కల్పించినట్లు చెప్పారు. ఇళ్లలో నీళ్లు చేరినందున రోజుకు దాదాపు లక్షా పది వేల మందికి భోజనం అందిస్తున్నట్లు వివరించారు.  

30 పట్టణాల్లో...

          జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని 30 పట్టణాల్లో వర్షాలు, వరదల ప్రభావం ఉందని... 238 కాలనీలు జలమయమయ్యాయని, 150 చోట్ల రహదార్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. 26 విద్యుత్ సబ్ స్టేషన్లలోకి నీరు వచ్చిందని... యుద్ధప్రాతిపదికన తొలగించినట్లు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు, సెల్లార్లలో నీళ్లు ఉన్న అపార్ట్​మెంట్లకు విద్యుత్ సరఫరా తొలగిస్తున్నామని, పూర్తైన చోటల్లా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతోందని తెలిపారు.

తీరని నష్టం...

       చాలా చోట్ల వరదల వల్ల, ముఖ్యంగా మూసీనదీ వెంట ఉన్న ట్రాన్స్​ఫార్మర్లు, కరెంట్ స్తంభాలు కొట్టుకుపోయాయని... విద్యుత్ శాఖ పరంగా దాదాపు రూ. 5 కోట్ల మేర నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 101 చెరువు కట్టలు తెగాయని,  26 చెరువు కట్టలకు గండ్లు పడ్డాయని అధికారులు తెలిపారు.

         జలవనరుల శాఖకు రూ. 50 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేశారు. పంచాయతీ రాజ్ రోడ్లు 475 చోట్ల, రూ. 295 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ఆర్​అండ్​బీ రోడ్లు 113 చోట్ల దెబ్బతిన్నాయని... శాఖ పరిధిలో రూ. 184 కోట్లు, జాతీయ రహదార్ల పరిధిలో రూ. 11 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా వేశారు.  

ఆదుకోవాలని ప్రధానికి లేఖ...

        ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందన్న సీఎం కేసీఆర్... తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ. 1,350 కోట్లు సాయంగా అందించాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి లేఖ రాశారు. రైతుల కోసం రూ. 600 కోట్లు, జీహెచ్ఎంసీతో పాటు ఇతర ప్రాంతాల్లో సహాయ, పునరావాస, పునరుద్ధరణ చర్యల కోసం మరో రూ. 750 కోట్లు సాయంగా అందించాలని కేంద్రాన్ని కోరారు.

యుద్ధప్రాతిపదికన సాయం...

        ముంపుబారిన పడ్డ ప్రజలకు యుద్ధప్రాతిపదికన సాయం అందించాలని... బియ్యం, పప్పు, ఇతర నిత్యావసర సరుకులు, ఆహారంతో పాటు ప్రతి ఇంటికీ మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం తక్షణమే రూ. 5 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.  

రూ. 5 లక్షల ఆర్థిక సాయం...

       చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ఇళ్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇళ్లు మంజూరు చేస్తామన్న ముఖ్యమంత్రి... పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. నాలాలపై కట్టిన ఇళ్లు కూడా కూలిపోయాయని... వాటి స్థానంలో ప్రభుత్వ స్థలంలో కొత్త ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, అపార్ట్​మెంట్ల సెల్లార్లలో నీళ్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని, ఆ తర్వాతే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజలు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.  

అధికారులకు ఆదేశాలు...

         హైదరాబాద్​లో చాలా చోట్ల చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోని కాలనీలే జలమయమయ్యాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అపార్ట్​మెంట్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చే సందర్భంలో వరదనీరు సెల్లార్లలో నిలవకుండా ఏర్పాటు చేయాలనే నిబంధన పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.  

ఇదీ చూడండి: వర్షాలు తగ్గినా కొనసాగుతోన్న వరద ఉద్ధృతి

Last Updated : Oct 15, 2020, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.