KCR direction to TRS MPs: ఎల్లుండి నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్‌ఎస్ దృష్టిసారించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో లోక్‌సభ, రాభ్యసభ పక్ష నేతలు కె.కేశవరావు, నామ నాగేశ్వరరావుతో పాటు పలువురు టీఆర్‌ఎస్ ఎంపీలు సమావేశమయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాష్ట్రం, టీఆర్‌ఎస్ తరఫున లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దిల్లీ పరిణామాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం.
రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలను సభలో ప్రస్తావించాలని సూచినట్లు తెలుస్తోంది. తెలంగాణ అభివృద్ధిని ప్రోత్సహించకుండా ద్వేష పూరితంగా వ్యవహరించడాన్ని సభలో ఎండగట్టాలని పిలుపునిచ్చారని సమాచారం. ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఇవీచూడండి: