ETV Bharat / state

ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటన - Cm Kcr Delhi Tour Ended

CM KCR
CM KCR
author img

By

Published : May 23, 2022, 7:30 PM IST

Updated : May 23, 2022, 10:55 PM IST

19:21 May 23

హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌

Cm Kcr Delhi Tour Ends: ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ పర్యటన ముగిసింది. ఈ మేరకు ఆయన అకస్మాత్తుగా పర్యటన ముగించుకుని దిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకున్నారు. ఈనెల 20న దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌... పర్యటనలో పలువురు నేతలను కలిశారు. ఈనెల 25 వరకు మరికొందరు నేతలను కలిసేలా సీఎం షెడ్యూల్‌ ఉన్నప్పటికీ... అకస్మాత్తుగా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు సీఎం చేరుకున్నారు.

సీఎం కేసీఆర్ పర్యటన ఇలా..

  • మే 20వ తేదీన దిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో, ప్రముఖ ఆర్థికవేత్తలతో, జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టులతో సమావేశమయ్యారు.
  • మే 21న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. దిల్లీలోని కేసీఆర్ నివాసంలో రెండు గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు.. దేశంలోని తాజా పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు, ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరం గురించి ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.
  • మే 22వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్... దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఇరువురు సీఎంలు పలు అంశాలపై చర్చలు జరిపారు. కేజ్రీవాల్‌ నివాసంలోనే సీఎం మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఇరువురు సీఎంలు వారి బృందాలతో చండీగఢ్​కు వెళ్లారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించారు. వారికి ఆర్థికంగా భరోసానిచ్చేలా ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్​ పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఇవీ చూడండి:

Last Updated : May 23, 2022, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.