ETV Bharat / state

సీనియర్​ నటుడు చలపతిరావు మృతికి సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్​.. - చలపతిరావు పార్థీవదేహానికి తలసాని నివాళులు

CM KCR condoled the death of Chalapati Rao: సీనియర్​ నటుడు చలపతిరావు మృతికి సీఎం కేసీఆర్​ సంతాపం తెలిపారు. వెండితెరపై తన నటనతో చలపతిరావు తనదైన ముద్ర వేశారని సీఎం కొనియాడారు. అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ సైతం చలపతిరావు పార్థివదేహానికి నివాళులర్పించారు. తనతో ఉన్న సాన్నిహిత్యం గురించి గుర్తుచేసుకున్నారు.

cm kcr
సీఎం కేసీఆర్​
author img

By

Published : Dec 25, 2022, 3:11 PM IST

CM KCR condoled the death of Chalapati Rao: నటుడు చలపతిరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​ సంతాపం తెలిపారు. మూడు తరాల నటులతో కలిసి నటించిన గొప్ప వ్యక్తి చలపతిరావు అని సీఎం కొనియాడారు. వెండితెరపై తన నటనతో చలపతిరావు తనదైన ముద్ర వేశారన్నారు. చలపతిరావు మరణం సినీ రంగానికి తీరని లోటు అని సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​.. చలపతిరావు పార్థివదేహానికి నివాళులర్పించారు. సీనియర్​ నటుడు చలపతిరావు మరణం చాలా బాధాకరమని మంత్రి అన్నారు. చలపతిరావుతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉండేదని చెప్పారు. ఎన్టీఆర్​తో చలపతిరావుకు మంచి అనుబంధం ఉండేదని కొనియాడారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.