CM KCR on Manish Sisodia Arrest: లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దిల్లీ ఉప ముఖమంత్రి మనీశ్ సిసోదియా అరెస్టును బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ, అదానీ సంబంధాలపై ప్రజల దృష్టి మరల్చేందుకే మనీష్ సిసోదియాను అరెస్టు చేశారని కేసీఆర్ ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ట్విటర్, కేసీఆర్ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా స్పందించారు.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం మొదటిసారి కావడం గమనార్హం. కూతురు ఎమ్మెల్సీ కవితపైనా విమర్శలు వెల్లువెత్తినప్పుడూ సీఎం కేసీఆర్ నేరుగా స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలని చూస్తోందని బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. విపక్షాలపైనా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దిల్లీ డిప్యూటీ సీఎంను సీబీఐ అరెస్టు చేసిందని ఆరోపణలు చేస్తోంది.
-
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేయడాన్ని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ఖండించారు.
— Telangana CMO (@TelanganaCMO) February 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
ఈ అరెస్ట్ అదానికి, ప్రధాని మోడీకి నడుమనున్న అనుబంధాన్నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి చేసిన పనే తప్ప మరోటి కాదని సీఎం అన్నారు.
">ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేయడాన్ని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ఖండించారు.
— Telangana CMO (@TelanganaCMO) February 27, 2023
ఈ అరెస్ట్ అదానికి, ప్రధాని మోడీకి నడుమనున్న అనుబంధాన్నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి చేసిన పనే తప్ప మరోటి కాదని సీఎం అన్నారు.ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేయడాన్ని ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ఖండించారు.
— Telangana CMO (@TelanganaCMO) February 27, 2023
ఈ అరెస్ట్ అదానికి, ప్రధాని మోడీకి నడుమనున్న అనుబంధాన్నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి చేసిన పనే తప్ప మరోటి కాదని సీఎం అన్నారు.
ఓటమి జీర్ణించుకోలేకనే సిసోదియా అరెస్టు : సిసోదియా అరెస్టుపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహకుడు అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే స్పందించారు. కేంద్రంపై తరచూ తనదైన శైలిలో ఆరోపణలు గుప్పించే మంత్రి కేటీఆర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి జీర్ణించుకోలేకే సిసోడియాను అరెస్టు చేశారని.. విపక్షాలపై ఏజెన్సీలను ఉసిగొల్పుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ విషయంపై దేశవ్యాప్తంగా చర్యలు చేపట్టే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.
మార్చి 4 వరకు సీబీఐ కస్టడీ: ఆదివారం సిసోదియాను అరెస్ట్ చేసిన సీబీఐ.. భారీ బందోబస్తు మధ్య కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. చాలా ప్రణాళిక పద్ధతిలో మద్యం కుంభకోణంలో కుట్ర జరిగిందన్న సీబీఐ.. సిసోదియాను అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరింది. సమగ్రమైన విచారణ కోసం సిసోదియాను కస్టడీకి ఇవ్వడం అవసరమని.... సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. రిమాండ్ దరఖాస్తును వ్యతిరేకించిన సిసోదియా తరపు లాయర్ దయన్ కృష్ణన్.. సిసోదియాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. ఎవరైనా ఏదైనా చెప్పడానికి ఇష్టపడకపోతే... దాన్ని కారణంగా చూపి అరెస్ట్ చేయలేరని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎం.కె. నాగపాల్ సిసోదియాను మార్చి 4 వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ తీర్పునిచ్చారు.
బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన ఆప్ నేతలు : మనీష్ సిసోదియాను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి ఆప్ నేతలు ప్రయత్నించారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తగా, బీజేపీ కార్యాలయానికి వెళ్లే రహదారులను బారికేడ్లతో మూసేశారు. ఆప్ నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న ఆప్ నాయకులను అబిడ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి: