ETV Bharat / state

CM KCR Comments on Politics : 'దేశంలో ప్రస్తుత రాజకీయాలు పదవుల వెంట పరుగులు తీస్తున్నాయి' - CM KCR Comments on Politics

CM KCR Comments on National Politics : మహారాష్ట్రతో తెలంగాణది ‘రోటీ-బేటీ ’ బంధమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో జరిగిన ప్రగతిని.. మహారాష్ట్రలోనూ చేసి చూపిస్తామని తెలిపారు. సోలాపుర్‌, నాగ్‌పుర్‌ తదితర ప్రాంతాల నేతలు, ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి.. భారాస రూపంలో ప్రతి ఇంటి గడపముందుకు వచ్చి నిలుస్తోందని, తలుపులు తెరిచి ఆదరించాలని కేసీఆర్ కోరారు.

CM KCR Comments on Politics
CM KCR Comments on Politics
author img

By

Published : Jul 8, 2023, 8:50 PM IST

Updated : Jul 9, 2023, 9:25 AM IST

దేశంలో ప్రస్తుత రాజకీయాలు పదవుల వెంట పరుగులు తీస్తున్నాయి : కేసీఆర్

CM KCR Latest News : సోలాపుర్‌, నాగ్‌పుర్‌ తదితర ప్రాంతాల నేతలు, ప్రముఖులు తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని సోలాపుర్‌ సహా మహారాష్ట్రలో చేసి చూపించే బాధ్యత తనదని పేర్కొన్నారు. మరాఠా రాజకీయ పరిణామాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించిన కేసీఆర్‌... ‘అభివృద్ధి నిరోధకులకు ఓట్లేస్తూ, ఇంకెన్నాళ్లు వెనకబాటుతనంలో ఉందమని ప్రశ్నించారు.

CM KCR Latest News Today : అభివృద్ధి.. బీఆర్​ఎస్ రూపంలో ప్రతి ఇంటి గడపముందుకు వచ్చి నిలుస్తోందని, తలుపులు తెరిచి ఆదరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. మహారాష్ట్రతో తెలంగాణది 'రోటీ బేటీ' బంధమని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజల నడుమ మొదటి నుంచీ సామాజిక బాంధవ్యం, సాంస్కృతిక సారూప్యం ఉందని తెలిపారు. బీఆర్​ఎస్​ను మహారాష్ట్ర మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ప్రకటించారు. సాగునీటి ప్రాజెక్టులు సహా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసేందుకు మహారాష్ట్ర నేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ రంగానికి రాయితీలు ఇస్తున్నాయని... వ్యవసాయాధారిత భారత్‌లో పాలకులు అందుకు వ్యతిరేకించడం శోచనీయమన్నారు. దేశ రైతులను రక్షించుకుంటూ వ్యవసాయాన్ని సుసంపన్నం చేద్దామని. కిసాన్‌ సర్కార్‌తో జీవితాల్లో వెలుగులు నింపుదామని తెలిపారు.

దేశంలో ప్రస్తుత రాజకీయాలు పదవుల వెంట పరుగులు తీస్తున్నాయని పేర్కొన్నారు. తమ పార్టీలనే చీలికలు పేలికలు చేసుకుంటున్నారు. మహారాష్ట్రలో ఈ దిశగా జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలు గమనిస్తున్నారు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తాను మరోసారి సోలాపుర్‌ వస్తానని. వారం రోజుల ముందు మంత్రి హరీశ్‌రావును అక్కడికి పంపిస్తానని తెలిపారు. పెద్దఎత్తున ప్రజల భాగస్వామ్యంతో ర్యాలీతీసి... కనీసం 50 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభను నిర్వహించుకుందామని అన్నారు. మీరు పార్టీని గెలిపించుకోండి. మీ జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత స్వయంగా నేను తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారు.

భగత్​సింగ్, అల్లూరి వంటి వారి స్ఫూర్తితో దేశ ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రధానంగా యువతపైనే ఉందన్నారు. ఇతర దేశాల తరహాలో భారత్ ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నదో ఆలోచించాలన్నారు. కేంద్ర పాలకుల ఆలోచనలు సరిగా లేకపోవడమే కారణమన్న కేసీఆర్.. అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశ ఇజ్జత్​ను కాపాడుకోవాల్సి ఉందన్నారు. అభివృద్ధి నిరోధకులకు గెలిపించుకుంటూ.. తాగు, సాగు నీరు వంటి కనీస వసతులు లేకుండా ఎంతకాలం ఉందామని కేసీఆర్ ప్రశ్నించారు.

'దేశంలో రాజకీయాలు పదవుల వెంట పరుగులు తీస్తున్నాయి. పదవుల కోసం తమ పార్టీలనే చీల్చుకుంటూ పార్టీలు మారుతున్నారు. మహారాష్ట్రలో జరుగుతున్న సంఘటనలను దేశ ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి నిరోధకులను గెలిపించుకుంటూ కనీస వసతులు లేకుండా ఇంకెన్నాళ్లు ఉందాం. బీఆర్​ఎస్​ రూపంలో అభివృద్ధి మీ ఇంటి వద్దకు వచ్చింది. తలుపులు తెరిచి ఆహ్వానించండి. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదో చూద్దాం. బీఆర్​ఎస్​ను మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా విస్తరిస్తాం. సోలాపూర్‌లో త్వరలో బీఆర్​ఎస్ భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తాం.' - కేసీఆర్, బీఆర్​ఎస్ అధ్యక్షుడు

ఇవీ చూడండి..

Last Updated : Jul 9, 2023, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.