ETV Bharat / state

ఈనెల 7న తెరాస కార్యవర్గ సమావేశం... ఈ అంశాలపైనే చర్చ! - తెరాస కార్యవర్గ సమావేశం వార్తలు

పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం, ప్లీనరీ సమావేశాల అజెండా, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగత పునర్నిర్మాణంపై తెరాస దృష్టి సారించింది. ఫిబ్రవరి 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు.

cm-kcr-calls-for-trs-executive-meeting-on-feb-7th
ఈనెల 7న తెరాస కార్యవర్గ సమావేశం... ఈ అంశాలపైనే చర్చ!
author img

By

Published : Feb 5, 2021, 5:46 PM IST

పలు సంస్థాగత అంశాలపై చర్చించేందుకు... తెరాస రాష్ట్ర కార్యవర్గం ఈనెల 7న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన... తెలంగాణ భవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశానికి... తెరాస రాష్ట్ర కమిటీ సభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎమ్​ఎస్​ అధ్యక్షులు హాజరు కానున్నారు.

పార్టీ అధ్యక్షుడి ఎన్నిక..

ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక... ఏప్రిల్ 27న జరిగే పార్టీ వార్షిక మహాసభ సహా ఇతర సంస్థాగత అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. త్వరలో జరగనున్న శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాలు... ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, నాగార్జునసాగర్ ఉపఎన్నికపై కూడా కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.

వివాదాలపై చర్చ..

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలో తేలిన అంశాలను ఆయన పార్టీ నేతలకు వివరించి.... వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. ఇటీవల కొందరు పార్టీ నేతల వైఖరి వివాదాస్పదంగా మారుతున్నందున... ఇకపై అలాంటి వ్యవహారాలకు చోటులేకుండా కేసీఆర్‌ స్పష్టమైన సూచనలు చేయనున్నారు.

నెలకొన్న ఉత్కంఠ..

కేసీఆర్ దిల్లీ పర్యటన అనంతరం రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయస్థాయి రాజకీయాల్లో తెరాస పోషించాల్సిన పాత్ర, ముఖ్యంగా రైతు ఉద్యమం, పెట్టుబడుల ఉపసంహరణ తదితర అంశాల చర్చించే అవకాశం ఉంది. కేటీఆర్​ త్వరలో ముఖ్యమంత్రి అవుతారని పార్టీలో సీనియర్ నేతల నుంచి కార్యకర్తల వరకు తీవ్ర చర్చనీయాంశంగా మారినందున.. ఆ అంశంపైనా కేసీఆర్​ స్పష్టత ఇస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

ఇదీ చూడండి: 7న కేసీఆర్​ అధ్యక్షతన తెరాస కార్యవర్గ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.