ETV Bharat / state

సీఎం కేసీఆర్ ఆంధ్ర కమీషన్లకు ఆశపడుతున్నారు: వంశీచంద్ - krishna penna latest News

ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్ముక్కైన సీఎం కేసీఆర్ వారిచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి రాష్ట్ర జలవనరులను అదోగతి పట్టిస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు. కృష్ణా నీటిని పెన్నా బేసిన్‌కు తరలించేందుకు పిలుస్తున్న టెండర్ల పనులను ముందే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ జాప్యం చస్తూ ఆంధ్ర సర్కార్​కు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు.

సీఎం కేసీఆర్ ఆంధ్ర కమీషన్లకు ఆశపడుతున్నారు: వంశీచంద్

author img

By

Published : Jul 31, 2020, 8:42 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వారిచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి, తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం మే నెల 5న జీఓ 203 ద్వారా కృష్ణా బేసిన్ నీటిని పెన్నా బేసిన్‌కు తరలించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగులేటర్ సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రతిపాదన చేసినప్పుడు సీఎం కేసీఆర్ స్పందించలేదని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ ఆంధ్ర కమీషన్లకు ఆశపడుతున్నారు: వంశీచంద్

ముఖ్యమంత్రి నుంచి స్పందనే లేదు...

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల కోసం ఈ నెల 15న టెండర్లు పిలిచినప్పటికీ సీఎం నుంచి స్పందనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి రాయలసీమను రతనాలసీమగా మార్చాలన్న కుట్రలో భాగమేనని ధ్వజమెత్తారు.

అందుకే వాయిదా పడేలా చేస్తున్నారు...

ఏపీ కాంట్రాక్టర్లతో కుమ్ముక్కైన సీఎం కేసీఆర్‌ ఆగస్టు 5న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఆగస్టు 20కు వాయిదా పడేలా ప్రతిపాదన చేస్తున్నారని వెల్లడించారు. ఆగస్టు 19 నాటికి టెండర్ల ఖరారు కూడా పూర్తవుతుందని అందుకే సీఎం ఆగస్టు 20 తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టారని దుయ్యబట్టారు. టెండర్ల ఖరారు తర్వాత సమావేశం పెట్టినా ఉపయోగం ఏమీ ఉండదని వంశీచంద్ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఇచ్చే ఆదేశాలను ఏపీ పట్టించుకోలేదని.. ఇప్పుడిచ్చిన ఆదేశాలను కూడా పెడచెవిన పెడుతోందన్నారు.

అపెక్స్ కౌన్సిల్​లోనే మనకు న్యాయం..

కేవలం అపెక్స్ కౌన్సిల్‌లొనే తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి టెండర్ల దాఖలకు చివరి రోజు ఆగస్టు 10లోగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయాలన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్ ప్రక్రియను అడ్డుకొని, రద్దు చేయించాలని వంశీ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : కరోనా వ్యాక్సిన్ల రేసులో ప్రపంచ దేశాల పరుగు.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.