ETV Bharat / state

CM KCR ON HOUSE SCHEME: ప్రభుత్వ సాయంతో ఇళ్లు నిర్మించుకునే పథకం: సీఎం కేసీఆర్ - జాగా ఉంటే ఇళ్లు

సొంత జాగా ఉన్న పేదలు ప్రభుత్వ సాయంతో ఇళ్లు నిర్మించుకునే పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఒక్కో నియోజకవర్గంలో 1,000 నుంచి 1,500 మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. రాజకీయాల కోసం తెలంగాణను చులకన చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. సంక్షేమానికి కాంగ్రెస్‌ కంటే 5 రెట్లు అధికంగా ఖర్చు చేసినట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

CM KCR ON HOUSE SCHEME
ప్రభుత్వ సాయంతో ఇళ్లు నిర్మించుకునే పథకం
author img

By

Published : Oct 9, 2021, 5:12 AM IST

సొంత జాగా ఉన్న పేదలు ప్రభుత్వ సాయంతో ఇళ్లు నిర్మించుకునే పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఆ పథకం అమలు చేస్తామని బడ్జెట్‌ సందర్భంగా హామీ ఇచ్చామని, దాన్ని 100 శాతం తెస్తామని చెప్పారు. శాసనసభలో శుక్రవారం సంక్షేమంపై జరిగిన లఘుచర్చలో సభ్యులు మాట్లాడిన అనంతరం వారి ప్రశ్నలకు, సందేహాలకు సీఎం సమాధానమిచ్చారు. నిర్దేశించిన అర్హతలను పాటించి ఒక్కో నియోజకవర్గంలో 1,000 నుంచి 1,500 మందికి లబ్ధి చేకూరేలా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో సంక్షేమ పద్దు కింద పెట్టిన ఖర్చు కంటే ఈ ఏడేళ్లలో అయిదు రెట్లు అధికంగా వెచ్చించామని గణాంకాల సహితంగా వివరించారు. రాజకీయాల కోసం రాష్ట్రాన్ని చులకన చేసి మాట్లాడొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. ఇంకా పలు అంశాలపై సీఎం మాట్లాడారు.

ఏడేళ్లలో సంక్షేమానికి రూ.74,165 కోట్లు

ఏ పథకం తెచ్చినా.. మీ జేబుల్లో నుంచి ఇస్తున్నారా అని కొందరు చులకనగా మాట్లాడుతున్నారు. వసూలు చేసిన పన్నులను ధర్మబద్ధంగా తాత్కాలిక, మధ్య, దీర్ఘకాలిక అవసరాలకు వినియోగించాలి. మీ రాజకీయాల కోసం మన తెలంగాణను మలినం చేయొద్దు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, మహిళా, శిశు సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ 10 సంవత్సరాల్లో రూ.21,663 కోట్లు ఖర్చు చేయగా.. మేం ఈ ఏడేళ్లలో రూ.74,165 కోట్లు వ్యయం చేశాం. రాష్ట్ర ఏర్పాటుకు ముందు పదేళ్లలో సగటున ఏడాదికి రూ.2,166 కోట్లు ఖర్చు చేస్తే మేం రూ.10,600 కోట్ల చొప్పున వ్యయం చేశాం. అంటే 5 రెట్లు అధికం. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్‌ కళాశాల నిర్మిస్తాం. రూ.10 వేల కోట్లతో వైద్య రంగంలో మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నాం. కిడ్నీ రోగులకు కొత్తగా 38 డయాలసిస్‌ కేంద్రాలను నెలకొల్పాం. వారి రాకపోకల కోసం 10 వేల బస్‌పాసులిచ్చాం. ఇంకా కేంద్రాలను, బస్‌పాసులను పెంచుతాం. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్‌ కళాశాల నిర్మిస్తాం. రూ.10 వేల కోట్లతో వైద్య రంగంలో మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నాం.

కరోనాతో ‘ప్లే స్కూళ్లు’ వాయిదా

కేజీ టూ పీజీ విద్య అనేది మంచిమాట. ఆర్థికంగా మంచి స్థానంలో ఉన్నవారు పిల్లలను ప్లే స్కూళ్లకు పంపించి ఆంగ్లం నేర్పిస్తారు. పేదల పిల్లలకు అలాంటి విద్య అందించాలని విద్యావేత్తలు, ఎస్‌సీఈఆర్‌టీ నిపుణులు తదితరులతో ఈ పథకం గురించి సుదీర్ఘంగా చర్చించా. చిన్న పిల్లల్ని హాస్టళ్లలో ఉంచితే జ్వరాలు వస్తుంటాయని, ఇంటి బెంగ పెట్టుకుంటారని ఈ సందర్భంగా వారు చెప్పారు. అందుకే అయిదో తరగతి నుంచి గురుకులాలు ప్రారంభించాం. చిన్నారులు అంగన్‌వాడీలకు వెళ్తుంటారు కాబట్టి వాటినే ప్లే స్కూళ్లుగా మార్చాలనుకున్నాం. కరోనాతో అది వాయిదా పడింది. 5వ తరగతి వరకు చదివే పిల్లలకు గురుకుల పాఠశాలల్లో ప్రవేశంకల్పించే విషయమై ఆలోచన చేస్తాం.

రాష్ట్రానికి 15 లక్షల పైచిలుకు కార్మికులు వలస వస్తున్నారు. ఒకప్పుడు పాలమూరు వాసులు ముంబయి వెళ్లేవారు. ఇప్పుడు కర్నూలు జిల్లా వాళ్లు పనుల కోసం పాలమూరుకు వస్తున్నారు. మెట్రో ప్రాజెక్టు లాభసాటి కాదని, నష్టం వస్తుందని వయబిలిటీ గ్యాప్‌ నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని ప్రాజెక్టు ప్రతినిధి నా వద్దకు వచ్చాడు. మరోసారి కనిపిస్తే ఈ భవనం నుంచి కిందికి తోస్తానని చెప్పా. వక్ఫ్‌ బోర్డు ఆస్తుల కబ్జాపై సీబీసీఐడీ విచారణను ఏడాదిలోపు పూర్తిచేస్తాం. ఉస్మానియాఆసుపత్రి నిర్మాణ పనులూ మొదలుపెడతాం.

రోశయ్య అసెంబ్లీలోకి ఉరితాడు తెచ్చారు!
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా కరెంట్‌ ఇవ్వలేకపోతే అసెంబ్లీలోనే ఉరేసుకుంటానని ఆనాటి విద్యుత్తు శాఖ మంత్రి రోశయ్య ప్రకటించారు. కరెంటు సమస్య పరిష్కారం కాలేదు. దాంతో ఆయన మధ్యాహ్నం సూట్‌కేసులో ఉరితాడును అసెంబ్లీకి తీసుకొచ్చారు. మేమందరం వారించాం. ప్రపంచ మేధావి(రోశయ్య) కూడా కరెంట్‌ ఇస్తానని ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్‌కు ఆ నైపుణ్యాలు లేవు. తెరాసకు ఉన్నాయి.

నవంబరు లేదా డిసెంబరులో యాదాద్రి ఆలయ ప్రారంభం

రాష్ట్రంలో ఏ ఒక్క కులాన్నీ విస్మరించలేదు. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేలా రాష్ట్రాన్ని మారుస్తున్నాం. హైదరాబాద్‌ శివారులో చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో సమతామూర్తి విగ్రహం నిర్మిస్తున్నారు. ప్రపంచంలోని వైష్ణవులు అందరూ తప్పనిసరిగా దర్శించుకునేలా ఆ ఆలయం ఉంటుంది. అన్ని మతాలను గౌరవిస్తాం. ఎవరి విశ్వాసం వారిది. యాదాద్రిఆలయ ప్రారంభం నవంబరు, డిసెంబరులో ఉంటుంది.- సీఎం కేసీఆర్

కేంద్రం నిధులిస్తోందన్న పిచ్చి మాటలు బంద్‌ చేస్తే మంచిది

కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అన్ని రాష్ట్రాలకూ నిధులొస్తాయి. ఒక్క తెలంగాణకే ప్రత్యేకంగా ఏమీ ఇవ్వరు. గత ఏడేళ్లలో కేంద్రం రూ.42 వేల కోట్లు ఇచ్చింది. రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది మాత్రం రూ.2,74,000 కోట్లు. ఈ దేశాన్ని సాకే అయిదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇప్పటికైనా కేంద్రం నిధులు ఇస్తోందన్న పిచ్చి మాటలు బంద్‌ చేస్తే మంచిది. ఇంకొందరు నిధులను దారి మళ్లిస్తున్నారని చెబుతున్నారు...అసలు ఇస్తే కదా మళ్లించేది? వ్యవసాయం తెలియదు, తెలివి లేదని ఎగతాళి చేసిన రాష్ట్రంలో సగటు తలసరి ఆదాయం రూ.1,70,215లు అయితే...మన రాష్ట్రంలో రూ.2,37,630గా ఉంది. జాతీయ స్థాయిలో ఇది కేవలం రూ.1,28,828. ఇలాంటప్పుడు కేంద్రం నిధులు ఇస్తోందనే వాదనలో అర్థం లేదు. త్వరలోనే యాదాద్రి, ఎన్‌టీపీసీ, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి.

ఇదీ చూడండి:

TELANGANA ASSEMBLY SESSION: రాజకీయాల కోసం రాష్ట్ర ప్రగతిపై చులకనగా మాట్లాడొద్దు: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.