రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లు కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. చట్టాల ద్వారా కేంద్రం మార్కెట్లు తొలగించినా... రాష్ట్రంలో మాత్రం ఉంటాయని తెలిపారు. గత సంవత్సరం రైతు నష్టపోకుండా ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వం రూ.7వేల నుంచి 8వేల కోట్ల నష్టం భరించామని తెలిపారు. రైతులు సైతం తేమ లేకండా ధాన్యాన్ని తీసుకురావాలని... ఈ విషయంలో ప్రజాప్రతినిధులు వారికి అవగాహన కల్పించాలని సూచించారు.
వ్యవసాయ చట్టాలపై..
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై అనిశ్చితి ఉందని సీఎం తెలిపారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని నచ్చినా నచ్చకపోయినా అమలు చేయాల్సిందేనని వెల్లడించారు. కోర్టు పరిధిలో ఉన్నందున సాగు చట్టాలపై మాట్లాడలేకపోతున్నామని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూస్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ధరణి రైతులకు వరం... పైరవీకారులకు ఆశనిపాతం: సీఎం