ETV Bharat / state

పోలవరం రుణాలపై ప్రధానికి సీఎం జగన్ లేఖ - పోలవరం ప్రాజెక్టు వార్తలు

పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికి పూర్తిచేసేందుకు రూ. 15 వేల కోట్లు అవసరమని ఏపీ సీఎం జగన్... ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన రూ.3805.62 కోట్లు విడుదల చేయాలని ప్రధానిని కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్ల రుణం సమీకరించేందుకు నాబార్డుకు అనుమితులు ఇవ్వాలని సీఎం కోరారు.

polavaram
polavaram
author img

By

Published : Aug 27, 2020, 1:14 PM IST

పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్‌ నాటికి పూర్తిచేసేందుకు వచ్చే మార్చి నెలాఖరులోపు రూ.15 వేల కోట్లు అవసరమని ఏపీ సీఎం జగన్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన రూ.3805.62 కోట్లు విడుదల చేయాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవసరమైన రూ.15 వేల కోట్ల రుణం సమీకరించేందుకు నాబార్డును అనుమతించాలని కోరారు. నిధుల విడుదలలో నిర్వహణపరమైన ఆలస్యాన్ని నిరోధించేందుకు పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ వద్ద రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని విన్నవించారు.

నిధుల విడుదలకు విధివిధానాలు సులభతరం చేయాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్లు పోలవరానికి కావాలని కోరారు. ప్రధాన డ్యాం పనులకు రూ.5 వేల కోట్లు, కాల్వలకు రూ.5 వేల కోట్లు, పునరావాసానికి రూ.5 వేల కోట్లు అవసరమని సీఎం లేఖలో పేర్కొన్నారు. ఇప్పటివరకు పోలవరంపై 12 వేల 312.088 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: 'ఈటీవీ'కి మహేశ్​ రజతోత్సవ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.