ETV Bharat / state

AP CM Jagan On Gulab Cyclone: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల తక్షణ సాయం - తుపాన్ వార్తలు

తుపాన్ ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ (ap cm jagan video conference on cyclone) నిర్వహించారు. తుపాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ముంపు ప్రాంతాల ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

AP CM Jagan On Gulab Cyclone:
రూ.ఐదు లక్షలు తక్షణ సాయం
author img

By

Published : Sep 27, 2021, 2:24 PM IST

ఆంధ్రప్రదేశ్​లో తుపాను అనంతర పరిస్థితులపై ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష (cm jagan video conference on cyclone)నిర్వహించారు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు అంశాలపై చర్చించారు. సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ తుపాను అనంతర పరిస్థితులను వివరించారు. వర్షం తగ్గుముఖం పట్టగానే విద్యుత్‌ పునరుద్ధరించాలని సీఎం జగన్ (AP CM Jagan) ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు కూడా అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని సీఎస్‌కు సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.

వెనకడుగు వేయొద్దు..

అలాగే బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్న జగన్ (AP CM Jagan)... బాధితులకు సహాయం చేయడంలో వెనకడుగు వేయవద్దని తెలిపారు. సహాయక శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం, రక్షిత తాగునీరు అందించాలి సూచించారు. అవసరమైన అన్నిచోట్లా సహాయక శిబిరాలు తెరవాలని, విశాఖలోని ముంపు ప్రాంతాల్లో వర్షపు నీరు తొలగించాలన్నారు.

ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ (AP CM Jagan)సూచించారు. ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలన్నారు. అలాగే శిబిరాల నుంచి బాధితులు వెళ్లేటప్పుడు రూ.వెయ్యి చొప్పున అందజేయాలని పేర్కొన్నారు. వరద ప్రాంతాల్లో త్వరగా పంట నష్టం అంచనాలు రూపొందించాలన్నారు. నష్టం అంచనాలు సిద్ధం చేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

ఇదీ చూడండి: Heavy Rain in Telangana 2021 : బీ అలర్ట్... వాతావరణ కేంద్రం కీలక హెచ్చరిక!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.