ETV Bharat / state

స్టీల్‌ ప్లాంట్‌పై మోదీకి మరోసారి జగన్‌ లేఖ - విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ ఉక్కును వందశాతం ప్రైవేటీకరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తేల్చి చెప్పిన నేపథ్యంలో ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని ఆ రాష్ట్ర సీఎం జగన్‌ భావిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీని సమయం కోరుతూ నాలుగు పేజీల లేఖ రాశారు.

vishaka steel plant privatisation news
స్టీల్​ ప్లాంట్​పై మరోసారి ప్రధానికి జగన్ లేఖ
author img

By

Published : Mar 9, 2021, 1:46 PM IST

ఏపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రధాని మోదీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మరోసారి లేఖ రాశారు. అందులో ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరారు. విశాఖ ఉక్కుపై నేరుగా చర్చించేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. అఖిలపక్షంతో కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి జగన్ విజ్ఞప్తి చేశారు.

వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణపై పునఃపరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు. గతంలో రాసిన లేఖలోని అంశాలను మరోసారి ప్రస్తావించారు. కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ను లాభాల్లో తెచ్చేందుకు ఉక్కు మంత్రికి సూచనలు చేశామని.. ఆర్‌ఐఎన్‌ఎల్‌ సంస్థ వద్ద 7 వేల ఎకరాలు ఉపయోగించని భూమి ఉంది లేఖలో ప్రధానికి తెలిపారు. ప్లాట్ల కింద మార్చి ఆర్‌ఐఎన్‌ఎల్‌ను ఆర్థికంగా బలపరచవచ్చని ప్రధానికి జగన్ వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.