ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ కరవు నివారణ కోసం ప్రాజెక్టులు చేపడుతున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అయితే వీటిపై కొందరు వివాదాలు సృష్టిస్తున్నారని సీఎం ఆరోపించారు. 'మన పాలన - మీ సూచన' పేరిట రెండో రోజు జరిగిన మేథో మధన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
శ్రీశైలంలో 796 అడుగుల వరకు తెలంగాణ వాళ్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని సీఎం అన్నారు. ఇలా అయితే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఏ విధంగా నీళ్లు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం చూపించేందుకు 800 అడుగుల వద్ద 2 టీఎంసీలతో పంపులు ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. కృష్ణా నదిపై కట్టే ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం జరగదని స్పష్టం చేశారు. తమకు కేటాయించిన నీటినే తీసుకుంటున్నామన్నారు. రాయలసీమ కరవు నివారణకు రూ.27 వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మిస్తామని సీఎం జగన్ తెలిపారు.
మరోవైపు పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు 50 వేల క్యూసెక్కుల నీటిని తీసుకొచ్చేలా కెపాసిటీ పెంచుతామని వెల్లడించారు. దీనివల్ల రాష్ట్రమంతా సస్యశ్యామలం అవుతుందని జగన్ తెలిపారు.
ఇదీ చదవండి: ఈ నెల 29న కొండపోచమ్మ జలాశయం ప్రారంభం: హరీశ్