ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ థర్మల్ విద్యుత్ కేంద్రం మూడో యూనిట్‌ను జాతికి అంకితమిచ్చారు. 2008లో థర్మల్ స్టేషన్‌కు వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టారన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. ఈ మూడో యూనిట్‌కు రూ.3 వేల 200 కోట్లు ఖర్చు అయిందని అన్నారు. రాష్ట్ర విద్యుత్ వినియోగంలో 45 శాతం ఏపీ జెన్కో నుంచి వస్తోందని చెప్పారు. థర్మల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులకు నిండు మనసుతో అభివాదం చేస్తున్నానని స్పష్టం చేశారు. నిర్వాసితుల కుటుంబాలకు నవంబరులోగా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఎన్నికల సమయంలో సర్వేపల్లి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు వచ్చానని సీఎం జగన్ అన్నారు. రూ.36 కోట్ల మేర నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజ్‌ను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నామని.. రూ.25 కోట్లతో మిని ఫిషింగ్ హార్బర్ పనులు చేపడుతున్నామని చెప్పారు. పెన్నానదిపై ముదివర్తి వద్ద రూ.93 కోట్లతో సబ్ మెర్సబుల్ కాజ్ వే నిర్మిస్తామన్నారు. ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నా... గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నెల్లూరు బ్యారేజ్‌కు నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు పెడుతున్నట్లు చెప్పారు. ఉప్పుకాలువపై హై లెవెల్ బ్రిడ్జిని మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. నక్కల వాగుపై రూ.10 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, గురుమూర్తి పొల్గొన్నారు.
ఇవీ చదవండి: