పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పట్ల మంత్రి జగదీశ్‌రెడ్డి అనుసరించిన తీరును సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. మంత్రి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే మంత్రులు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ప్రజా ప్రతినిధులు అడిగిన వాటికి సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యతన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతుబంధు, రుణమాఫీ అందలేదని ప్రతి సమావేశంలో కచ్చితంగా నిలదీస్తామన్నారు.
ఇవీ చూడండి: లెక్కలు అడిగితే మంత్రికి కోపం వస్తోంది: ఉత్తమ్