ETV Bharat / state

కొత్త రెవెన్యూ చట్టంపై సీఎల్పీ నేత భట్టి, సీఎం కేసీఆర్ వాదనలు

సమగ్ర భూసర్వే చేయకపోతే భూ సమస్యలు అలాగే ఉంటాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అనుమానం వ్యక్తం చేశారు. ఆర్టీఓ కోర్టు గానీ, జాయింట్‌ కలెక్టర్‌ కోర్టు గానీ ప్రజలకు దగ్గరగా ఉంటాయన్నారు. సివిల్‌ కోర్టుల ద్వారా సమస్యలు ఎలా పరిష్కరిస్తారో వివరించాలని కోరారు. నూతన రెవెన్యూ చట్టంలోనూ అనేక లోపాలున్నట్లు శాసనసభలో భట్టి ప్రస్తావించారు. స్పందించిన సీఎం కేసీఆర్ వీఆర్వో వ్యవస్థలో అరాచకాలు ఉన్నందునే పూర్థిగా రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. చట్టాలు రూపొందించేటప్పుడు విశాల కోణంలో ఆలోచించాలని బదులిచ్చారు.

కొత్త రెవెన్యూ చట్టంపై సీఎల్పీ నేత భట్టి, సీఎం కేసీఆర్ వాదనలు
కొత్త రెవెన్యూ చట్టంపై సీఎల్పీ నేత భట్టి, సీఎం కేసీఆర్ వాదనలు
author img

By

Published : Sep 11, 2020, 4:02 PM IST

"కొత్త రెవెన్యూ చట్టంలోనూ లోపాలు ఉన్నాయని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అన్నారు.పేదలు భూములు పోగొట్టుకోకుండా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నట్లు అసెంబ్లీలో సీఎం కేసీఆర్​ను భట్టి విక్రమార్క కోరారు. పట్టాలు లేని పేదలకు, భూములకు పట్టాలు ఇవ్వండిని సూచించారు.

సామాజిక తెలంగాణ తెచ్చుకున్న మనం... పేదల సమస్యలను పరిష్కరించాలన్నారు. సాదా బైనామా కింద ఇంకా 2 లక్షల భూములు పెండింగ్‌లో ఉన్నాయని భట్టి గుర్తు చేశారు. అప్‌డేట్‌ చేసేటప్పుడు సాదాబైనామా భూములను ఎలా నమోదు చేస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు. రోజువారీ జమాబంధీ చేస్తుంటేనే పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. పూర్తిస్థాయి అధికారి ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు".

- మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ నాయకుడు.

"భట్టి వ్యాఖ్యలకు స్పందించిన సీఎం కేసీఆర్ వీఆర్వో వ్యవస్థ పోయిందని కుండ బద్దలుకొట్టారు. దానిని కొనసాగించాలని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రస్తుత వీఆర్వో వ్యవస్థ చెడిపోయింది. చట్టాలు రూపొందించేటప్పుడు విశాల ధృక్పథంతో ఆలోచించాలి. వీఆర్వో వ్యవస్థలో అవినీతి, అరాచకాలు రాజ్యమేలుతున్నాయి. అందుకే ఆ వ్యవస్థను పూర్థి స్థాయిలో తొలగించాం"

- సీఎం కేసీఆర్

కొత్త రెవెన్యూ చట్టంపై సీఎల్పీ నేత భట్టి, సీఎం కేసీఆర్ వాదనలు
కొత్త రెవెన్యూ చట్టంపై సీఎల్పీ నేత భట్టి, సీఎం కేసీఆర్ వాదనలు

ఇవీ చూడండి : 'పేదలు భూములు పోగొట్టుకోకుండా సమస్యలు పరిష్కరించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.