పసుపుబోర్డు తీసుకురాలేకపోతే నిజమాబాద్ ఎంపీ అర్వింద్ రైతులకు క్షమాపణలు చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. పసుపుబోర్డు తీసుకువస్తారో లేదో స్పష్టం చేయాలన్నారు.
పసుపుబోర్డు తీసుకువస్తానన్న హామీతో నిజామాబాద్ ఎంపీగా గెలిచారని గుర్తుచేశారు. పార్లమెంట్‌లో పసుపుబోర్డు కావాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడితే అర్వింద్ విమర్శించడం సరైందికాదన్నారు. పసుపుబోర్డు తీసుకురాలేకనే కట్టు కథలల్లుతున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చూడండి: వాస్తవాలకు దూరంగా రాష్ట్ర బడ్జెట్: భట్టి