ETV Bharat / state

Bhatti: ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ఏడాది క్రితమే హెచ్చరించాం.. - bhatti vikramarka comments on cm kcr

తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ సర్కారు సంగమేశ్వర ప్రాజెక్టు కోసం ఏడాది కిందటే జీవో తెచ్చినా కేసీఆర్ (Kcr) పట్టించుకోలేదన్నారు. నీళ్ల యుద్ధం చేయబోతున్నట్లుగా కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శలు గుప్పించారు.

leader
భట్టి విక్రమార్క
author img

By

Published : Jun 23, 2021, 5:04 PM IST

తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు నీళ్ల యుద్ధం చేస్తామని అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆరోపించారు. దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగిన చందాన తెరాస ప్రభుత్వం, నేతలు ఏడాది తర్వాత మేల్కొన్నారని విమర్శించారు. సంగమేశ్వర ప్రాజెక్టు కోసం ఏపీ సర్కారు ఏడాది కిందటనే జీవో ఇచ్చిందన్నారు.

ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు కడుతూ నీళ్లు తీసుకుపోతోందని తాము చెప్పినా సీఎం కేసీఆర్ (Cm Kcr) పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు పిలవకముందే తాము చెప్పినా ముఖ్యమంత్రి నిద్రలేవలేదని ఆరోపించారు. నీళ్ల కోసం తెచ్చుకున్న తెలంగాణలో కృష్ణా నుంచి ఒక్క ఎకరానికి కూడా సర్కార్ నీరు ఇవ్వలేదని విమర్శించారు. లక్షల కోట్లు ఖర్చు చేసి కట్టిన కొత్త ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇవ్వలేదని ధ్వజమెత్తారు.

కేసీఆర్ తుపాకీ రాముడిలా ఊర్లవెంట తిరుగుతూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. రెండు పారాసిటమాల్ ట్యాబ్లెట్లు వేసుకుంటే కొవిడ్ తగ్గుతుందంటే... సీఎం (Cm) ట్రీట్మెంట్ తీసుకున్న ఆసుపత్రిలో రూ. 28 లక్షలు ఎలా వసూళ్లు చేస్తున్నారని నిలదీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భూత వైద్యం వల్లే ఇన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయని, కేసీఆర్ నిర్లక్ష్యపు మాటల వల్లే అధికారులు నిద్రపోయారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణను కాపాడటం కోసం నీళ్ల యుద్ధం చేయబోతున్నట్లుగా కొత్త డ్రామాకు తెరలేపారు. ఏపీ సర్కారు రాయలసీమ సంగమేశ్వర ప్రాజెక్టు కోసం ఏడాది కిందనే జీవో తెచ్చింది. దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్టుగా ఉంది. పేరుకు మాత్రం తెలంగాణ ప్రయోజనాలు అంటారు.. ఆయన కుటుంబ ఆర్థిక ప్రయోజనాలు తప్ప తెలంగాణ ప్రయోజనాలు ఎక్కడా లేవు. రెండు పారాసిటమాల్ సరిపోతవి అంటివి. నీకు తెలిసిన హాస్పిటలే కదా 28 లక్షల బిల్లు వేసింది. రెండు పారాసిటమాల్​ గోళీలకు 28 లక్షలు అవుతాయా?

-- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

సీఎం కేసీఆర్, మంత్రులపై భట్టి ఫైర్

ఇదీ చూడండి: KCR ON CORONA: రెండే రెండు గోళీలు వాడిన... కరోనా ఖతమైంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.