ETV Bharat / state

జీవో 203ని కాంగ్రెస్​ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది: భట్టి విక్రమార్క - కాంగ్రెస్​

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 203ను రాష్ట్ర కాంగ్రెస్​ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శ్రీశైలం నీళ్లను ఏపీ అక్రమంగా తరలిస్తే తెలంగాణ జిల్లాలు బీడుగా మారుతాయన్నారు. ఇదంతా తెలిసినా సీఎం కేసీఆర్​ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టాలని డిమాండ్​ చేశారు.

clp leader bhatti vikramarka comments on cm kcr
జీవో 203ని కాంగ్రెస్​ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది: భట్టి విక్రమార్క
author img

By

Published : Aug 2, 2020, 4:54 AM IST

రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సంగమేశ్వరం నుంచి రోజుకు మూడు టీఎంసీ నీటిని అక్రమంగా తరలించేందుకు... అలాగే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల నుంచి 88 వేల క్యూసెక్కులకు సామర్థ్యాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 203 ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. శ్రీశైలం నీళ్లను ఏపీ అక్రమంగా తరలించుకునిపోతే దక్షిణ తెలంగాణ ముఖ్యంగా నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం ఎడారులుగా మారే ప్రమాదం ఉందన్నారు. అలాగే నాగార్జున సాగర్ ఎడమ కాలువపై ఆధారపడి ఉన్న భూములు కూడా బీడుగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇదంతా తెలిసినా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని... ఈ ముఖ్యమంత్రి రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పరవాలేదు అన్నట్లుగా పాలనా సాగిస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల నీటి సమస్యలు పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్​లో తెలంగాణ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని గట్టిగా మాట్లాడాల్సిన ప్రభుత్వం... టెండర్లు చివరి దశకు చేరుకున్న తర్వాత మాట్లాడి ఏమి లాభం లేదన్నారు. వెంటనే అపెక్స్​ కౌన్సిల్ మీటింగ్​కు హాజరై తెలంగాణ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని మనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి... ఏపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరి మార్చుకోకపోతే... కాంగ్రెస్ పార్టీ పక్షాన భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని భట్టి విక్రమార్క హెచ్చరించారు.

ఇవీ చూడండి: బుధవారం రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.