ETV Bharat / state

​​​​​​​ వీరు ఆరోపణలు చేస్తుంటే.. వారు ఆదర్శమంటున్నారు: భట్టి - BHATTI FIRES ON CM KCR

తెరాస, భాజపాల మధ్య కుదిరిన ఒప్పందం ఏంటో ప్రజలకు చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్​ చేశారు. రాష్ట్ర భాజపా నేతలు మిషన్​ భగీరథ ఓ కుంభకోణమని విమర్శలు చేస్తుంటే.. కేంద్ర జల్​శక్తి మంత్రి మాత్రం గొప్ప పథకం అని అనడంలో మర్మమేంటో ప్రజలకు తెలియాలన్నారు.

​​​​​​​ వీరు ఆరోపణలు చేస్తుంటే.. వారు ఆదర్శమంటున్నారు: భట్టి
author img

By

Published : Nov 12, 2019, 4:06 PM IST

మిషన్​ భగీరథ అతిపెద్ద కుంభకోణమని రాష్ట్ర భాజపా నేతలు విమర్శస్తుంటే.. కేంద్ర మంత్రి మాత్రం అదో గొప్ప పథకమని అనడంలో ఆంతర్యం ఏంటని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. భాజపా, తెరాస పార్టీలకు మధ్య కుదిరిన ఒప్పందం చెప్పాలని భట్టి డిమాండ్​ చేశారు. మిషన్​ భగీరథ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్​ చేశారు.

వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్​ కార్యాలయాలన్నీ.. మూతపడితే రెవెన్యూ శాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి ఎందుకు చొరవ తీసుకోలేదని నిలదీశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపించారు. కాళేశ్వరం, సీతారామ, మిషన్​ భగీరథ ప్రాజెక్టులపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్​ చేశారు.

​​​​​​​ వీరు ఆరోపణలు చేస్తుంటే.. వారు ఆదర్శమంటున్నారు: భట్టి

ఇవీచూడండి: మిషన్​ భగీరథ ఆదర్శం... దేశవ్యాప్తంగా అమలుచేస్తాం: కేంద్రమంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.