వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వలన తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడనుందని వెల్లడించారు. దీనికి అనుబంధంగా 7.6. కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన
ఉత్తర, తూర్పు తెలంగాణాలోని పలు జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవాళ, రేపు చాలా చోట్ల.. ఎల్లుండి కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదీ చూడండి : మున్నేరు లంకలో చిక్కుకున్న ముగ్గురు కాపరులు, 750 గొర్రెలు