సివిల్స్ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన అనంత్రాఘవ్ 578 ర్యాంకు సాధించారు. మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ రాలేదు. తరువాత మరింత పట్టుదలగా చదివిన రాఘవ... రెండో ప్రయత్నంలో లక్ష్యం సాధించారు. తల్లిదండ్రులు, సోదరుడి సహకారంతోనే సివిల్స్ లక్ష్యాన్ని చేరుకున్నానంటున్నారు అనంత్ రాఘవ్.
తండ్రి కోరికను నెరవేర్చేందుకు....
ఇంటర్ వరకు హైదరాబాద్‌లో విద్య అభ్యసించారు. గోవాలో బిట్స్‌పిలాని నుంచి 2011లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం దిల్లీలో ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేశారు. 2013 నుంచి సొంతంగా ఓ సంస్థ స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో సివిల్స్‌పై దృష్టి సారించి లక్ష్యం చేరుకున్నారు. ఎంపీడీఓగా పదవి విరమణ చేసిన తండ్రి నాగేశ్వరరావు తన కోరికను కుమారుడి ద్వారా తీర్చుకున్నానని హర్షం వ్యక్తం చేశారు.
ఇంకోసారికైనా సిద్ధమే...
ఈ ర్యాంకుకు ఐఏఎస్ లేదా ఐపీఎస్ వస్తుందని భావిస్తున్న రాఘవ్... ఒకవేళ రాకపోతే మరోసారి సివిల్స్‌కు సిద్ధమవుతానని తెలిపారు. ప్రణాళిక ప్రకారం కష్టపడి చదివితే ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని అనంత్ రాఘవ చెబుతున్నారు.
ఇవీ చూడండి: 'ఉగాది మార్పు... రాష్ట్రం నుంచే మొదలవ్వాలి'