ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, పట్టుదల వల్లే భారత ధాన్యాగారంగా తెలంగాణ అవతరించిదని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. యాసంగి సీజన్‌లోనూ రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధించడం రాష్ట్రానికి, రాష్ట్ర రైతాంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని పౌరసరఫరాల భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ యాసంగి సీజన్‌లో 39 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు అవ్వగా మొత్తం 79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి లభించిందని తెలిపారు. ఇప్పటి వరకు 6804 కొనుగోలు కేంద్రాల ద్వారా 65 లక్షల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేశామని ప్రకటించారు.
గత వానాకాలంలో 40.27 ఎకరాల్లో వరి సాగవ్వగా... 47 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చిందని శ్రీనివాసరెడ్డి అన్నారు. 2019-20 ఖరీఫ్, రబీ సీజన్లలో మొత్తం 1 కోటి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి లభించడం ప్రశంసనీయమన్నారు. గత యాసంగి సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు రూ.10 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో రూ.1012 కోట్లు జమ చేయనున్నామని ప్రకటించారు.
ఇదీ చాడండి: జగన్‌తో కేసీఆర్ చీకటి ఒప్పందం.. త్వరలోనే బయట పెడతాం: నాగం