ETV Bharat / state

పారదర్శకంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం: మారెడ్డి శ్రీనివాసరెడ్డి - corona virus

రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు, కనీస మద్దతు ధర చెల్లింపులపై పీసీసీ చీఫ్​ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలను పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. రైతుల పేరుతో కాంగ్రెస్ నేతలు జిమ్మిక్కులు చేస్తే ప్రజల్లో మరింత చులకనవుతారని హితవు పలికారు. యాసంగిలో ఈనెల 6వ తేదీ సాయంత్రం నాటికి పౌరసరఫరాల సంస్థ 6,188 కొనుగోలు కేంద్రాల ద్వారా 5.51 లక్షల మంది రైతుల నుంచి రూ. 5,826 కోట్ల విలువైన 31.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రూ. 2,815 కోట్లను రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు.

civil supply chairman mareddy srinivas reddy spoke on paddy purchase in telangana
పారదర్శకంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం: మారెడ్డి శ్రీనివాసరెడ్డి
author img

By

Published : May 7, 2020, 9:06 PM IST

దేశంలో ఏ రాష్ట్రంలో కొనుగోలు చేయని విధంగా పూర్తి పారదర్శకంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​ మారెడ్డి శ్రీనివాస్​రెడ్డి. ఇక గురువారం నాటికి 42.42 లక్షల (49శాతం) మంది తెల్లరేషన్​ కార్డుదారులకు 1 లక్ష 65 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 1,094 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేసినట్లు తెలిపారు. రేషన్ పంపిణీ, యాసంగి ధాన్యం సేకరణపై పౌరసరఫరాల శాఖలో జరిగిన సమావేశంలో ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వివరాలు వెల్లడించారు. యాసంగిలో ఈనెల 6వ తేదీ సాయంత్రం నాటికి పౌరసరఫరాల సంస్థ 6,188 కొనుగోలు కేంద్రాల ద్వారా 5.51 లక్షల మంది రైతుల నుంచి రూ. 5,826 కోట్ల విలువైన 31.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రూ. 2,815 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు.

కందిపప్పు కూడా సరఫరా చేస్తున్నాం

మే 1వ తేదీ నుంచి మొదటి విడతగా నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ రూరల్, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో ఉచిత బియ్యంతో పాటు కిలో కందిపప్పును సరఫరా చేస్తున్నామన్నారు. రెండో విడతగా మరో 7 జిల్లాలు కామారెడ్డి, మహబూబాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరిలో కందిపప్పు సరఫరాను ప్రారంభించామని తెలిపారు. వచ్చే రెండు మూడు రోజుల్లో సిద్దిపేట, భూపాలపల్లి, వికారాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ప్రారంభిస్తామన్నారు.

8లక్షల మందికి నగదు పంపిణీ చేయలేదు

గత మూడు నెలలుగా రేషన్ తీసుకోని సుమారు 8 లక్షల రేషన్ కార్డుదారులకు రూ.1500ల నగదును పంపిణీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి ధాన్యం అంచనాలు సరిగా లేవన్న.. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ జిల్లాలో ఆ జిల్లా కలెక్టర్ నివేదికల ప్రకారం 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా కాగా ఇప్పటి వరకు 5,34,588 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. సూర్యాపేట జిల్లాలో 4 లక్షల 80 వేల మెట్రిక్ టన్నులకు గాను 2 లక్షల 71 వేలు, యాదాద్రిలో 3 లక్షల 30 వేల మెట్రిక్ టన్నులకు గాను 1 లక్ష 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. నల్లగొండలో రూ. 580 కోట్లు, సూర్యాపేటలో రూ. 3వేల కోట్లు, యాదాద్రిలో రూ. 130 కోట్లు రైతుల ఖాతాలో జమచేశామన్నారు.

ధాన్యం కొనుగోలులో కేంద్రం సహకారం లేదు

కొంతమంది కేంద్రమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని చెపుతున్నారని... మరి అన్ని రాష్ట్రాల్లో ఎందుకు ఆ విధంగా చేయడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రంపై ఆర్థికంగా భారం పడుతోందన్నారు. అందుకే దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆ రాష్ట్రంలో పండిన పంటను పూర్తిస్థాయిలో కొనడం లేదని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్క సీజన్​కు దాదాపు రూ. 1000 కోట్ల వడ్డీ భారాన్ని భరిస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకారం ఏమాత్రం లేదన్నారు. లాక్​డౌన్ నేపథ్యంలో గన్నీ సంచులు కావాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసినా.. కనీస స్పందన కూడా రాలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: రైతు రుణమాఫీకి రూ1200 కోట్లు విడుదల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.