కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో సీఐటీయూ(CITU) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభిస్తున్నా కేంద్ర ప్రభుత్వం తనకు పట్టనట్లుగా వ్యవహరిస్తోందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు వీరయ్య విమర్శించారు. రాష్ట్రాలపై భారం వేస్తోందన్నారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పట్ల మెతకవైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపుతో ఉపాధిపోయి ఆదాయం దెబ్బతిన్న కార్మిక కుటుంబాలకు ఆర్ధిక సాయం చేయాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వటంతో పాటు ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Viral: చలానా తప్పించుకునేందుకు.. మహిళ పూనకం!