ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ పొడిగింపును భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సమర్థించింది. లాక్డౌన్ వల్ల చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు సవాళ్లను ఎదుర్కుంటున్నాయని సీఐఐ తెలంగాణ ఛైర్మన్ బోదనపు కృష్ణ తెలిపారు. అయినప్పటికీ కరోనా వ్యాప్తి నివారణకు లాక్డౌన్ పొడిగించడమే శరణ్యమని చెప్పారు. ప్రజలకు ఉపాధి కల్పిస్తూనే ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహించడం అవసరమని వ్యాఖ్యానించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ... ఆర్థిక కార్యకలాపాలను దశల వారీగా ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించాలని కోరారు.
ఇదీ చూడండి: రోడ్లపైకి భారీగా వలస కార్మికులు- పోలీసుల లాఠీఛార్జ్