Suchitra Ella: ఫార్మా, ఐటీ రంగాల్లో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని సీఐఐ నూతన ఛైర్పర్సన్ సుచిత్ర ఎల్లా అన్నారు. రాష్ట్రంలోను ఐదు లక్షల మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆమె పేర్కొన్నారు. సీఐఐ ఛైర్పర్సన్ హోదాలో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
మొత్తం రీజియన్‌కు 25 లక్షల ఉద్యోగాలు అనుకున్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యం పెట్టుకున్నాం. అందుకు అనుగుణంగానే మేం ముందుకెళ్తాం. ఐదు రాష్ట్రాల్లో ఉద్యోగాల కల్పనకు తమ వంతు కృషి చేస్తాం. -సుచిత్ర ఎల్లా, సీఐఐ నూతన ఛైర్పర్సన్
దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న 5 ఏళ్లలో 25 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని సుచిత్ర ఎల్లా తెలిపారు. రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చే దిశగా సీఐఐ తన వంతు కృషి చేస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ సహకారంతో సీఐఐ పని చేస్తుందని ప్రకటించారు.
తెలంగాణలో వరంగల్, నిజామాబాద్‌లలో పరిశ్రమల అభివృద్ధికి సీఐఐ కృషి చేస్తుందని సుచిత్ర ఎల్లా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు అక్కడి ప్రభుత్వంతో కలిసి తమ వంతు పాత్ర పోషిస్తామన్నారు. ఇక పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఐఐ గ్రీన్ ఇనిసియేటివ్స్ చేపట్టినట్లు ప్రకటించారు.
ఇవీ చదవండి: